Janaki Kalaganaledu 9 Nov Today Episode : జానకికి పరీక్ష పెట్టిన మైరావతి.. ఏకాంతంగా ఉన్న రామా, జానకిని అడ్డంగా పట్టుకున్న మైరావతి.. జానకికి ఏ శిక్ష వేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 9 Nov Today Episode : జానకికి పరీక్ష పెట్టిన మైరావతి.. ఏకాంతంగా ఉన్న రామా, జానకిని అడ్డంగా పట్టుకున్న మైరావతి.. జానకికి ఏ శిక్ష వేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :9 November 2021,12:30 pm

Janaki Kalaganaledu 9 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 167 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక ఎలాగైనా గోవిందరాజు.. జానకికి ఇచ్చిన అమ్మవారి విగ్రహాన్ని మాయం చేయాలని అనుకుంటుంది. దీంతో గోదావరిని పిలిచి అమ్మవారి విగ్రహం ఉన్న బ్యాగ్ ను ఇచ్చి ఇది మా బ్యాగ్ కాదు.. మగాళ్ల గదిలో పెట్టు అని చెబుతుంది. దీంతో ఆ బ్యాగ్ ను గోదావరి తీసుకెళ్తుంది. దీంతో ఫుల్ హ్యాపీ అవుతుంది మల్లిక.

janaki kalaganaledu 9 november 2021 full episode

janaki kalaganaledu 9 november 2021 full episode

కట్ చేస్తే.. జ్ఞానాంబ.. మైరావతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు అని పిలిచి.. తన దగ్గర కూర్చొని కాళ్లు పడుతుంది. ఏళ్లు గడిచాయి కదా మరిచిపోయావేమో అనుకున్నా. పాత పద్ధతులు నీకు ఇంకా గుర్తే ఉన్నాయి కోడలా అంటుంది మైరావతి. పద్ధతులు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. వాటిని ఎలా మరిచిపోతాం అత్తయ్య గారు అంటుంది జ్ఞానాంబ. నువ్వు పద్ధతులకు పెట్టింది పేరు.. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం అంటుంది మైరావతి. మీరు ఒక్కరే ఇక్కడ ఇంత ఇబ్బంది పడటం ఎందుకు.. మీరు కూడా మాతో రావచ్చు కదా.. ఈసారి మాత్రం మాతో రావాల్సిందే. లేకపోతే అస్సలు ఒప్పుకునేదే లేదు అంటుంది జ్ఞానాంబ.

ఈ ఇల్లు మీ మామయ్య గారి జ్ఞాపకం. ఇక్కడే నా ప్రాణం కూడా పోవాలె. నాకు కూడా మీ దగ్గరికి రావాలని ఉంది కానీ.. నేను అక్కడున్నా.. నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంటుంది. నాకు ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ తెలుసు కదా అర్థం చేసుకో అమ్మా.. అంటుంది మైరావతి. ఏం కోడలా… ఈ అత్తకు ఏదో చెప్పాలని ఆగిపోతున్నావు.. చెప్పు పర్లేదు అంటుంది మైరావతి. దీంతో జానకి విషయం అని అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 9 Nov Today Episode : జ్ఞానాంబకు భరోసా ఇచ్చిన మైరావతి

నువ్వు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు. అలాంటిది.. నువ్వే ఇంతలా ఆలోచిస్తున్నావంటే అది ఖచ్చితంగా పెద్ద సమస్య అయి ఉంటుంది అంటుంది మైరావతి. జానకి విషయం గురించి మీకు ఫోన్ లో చెప్పాను కదా అత్తయ్య గారు. జానకి.. స్వతహాగా మంచి అమ్మాయి. తను కోడలు అవడం ఏ ఇంటికైనా అదృష్టమే. తిట్టినా కొట్టినా.. తల దించుకుంటుంది కానీ.. తల ఎత్తి ఎదురు తిరగదు. తను చేయని తప్పుకు కూడా తనే శిక్షను అనుభవిస్తోంది. చాలా విషయాల్లో తన మంచితనాన్ని నేనే చూశాను కానీ.. నా మనసులో ఉన్న భయం ఒక్కటే. నా తమ్ముడికి వచ్చిన పరిస్థితి.. నా కొడుకు విషయంలో ఎక్కడ వస్తుందోనని భయమేస్తోంది.. అంటుంది జ్ఞానాంబ.

ఇంత చదువు చదివి స్వీట్ల కొట్టు వాడిని చేసుకున్నానని జానకి చిన్నచూపు చూస్తే ఎలా? ఈ ఆలోచన వస్తేనే నాకు భయంతో కాళ్లు చేతులు ఆడటం లేదు అత్తయ్య గారు. నాకొడుకు అసలే అమాయకుడు. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమగా చూసుకునే భార్య.. అలా చేస్తే వాడు తట్టుకోగలడా? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.. అని అసలు విషయం మొత్తం చెప్పేస్తుంది జ్ఞానాంబ.

జానకి విషయం నాకు వదిలేయ్.. నా మనవడికి తగిన భార్యో కాదో నేను తేలుస్తాను. నా కోడలుకు తగ్గ కోడలో కాదో కూడా నేనే నిర్ణయిస్తాను.. అని జ్ఞానాంబకు భరోసా ఇస్తుంది మైరావతి. మీరు ఇక్కడుండే ఈ 4 రోజులే జానకి భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని మైరావతి చెబుతుంది.

janaki kalaganaledu 9 november 2021 full episode

janaki kalaganaledu 9 november 2021 full episode

మరోవైపు తలనొప్పి అంటూ తెగ యాక్షన్ చేస్తుంది మల్లిక. దీంతో జానకి చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో మైరావతి వచ్చి జానకిని పిలుస్తుంది. దీంతో జానకి వెళ్తుంది. నువ్వు వచ్చిన గుర్తుగా మొక్కలు నాటితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నువ్వే గుంతలు తవ్వి మొక్కలు నాటితే బెటర్ అంటుంది మైరావతి. దీంతో సరే అమ్మమ్మ గారు నేనే నాటుతాను అంటుంది జానకి. నువ్వొక్కదానివే చేయాలి. ఎవ్వరి సాయం తీసుకోవడానికి వీలు లేదు అంటుంది మైరావతి. సరే అమ్మమ్మ గారు అంటుంది. వెళ్లి మొక్కలు నాటడం ప్రారంభిస్తుంది జానకి. ఇంతలో మల్లిక అక్కడే ఉండి ఇదంతా గమనిస్తుండటానికి చూసి.. ఏయ్ టింగరి ఇటురా.. ఏం చూస్తున్నావు అని అంటుంది.

మరోవైపు జానకిని బుక్ చేయడం కోసం.. జానకి.. రామా గదిలోకి వెళ్లగానే తలుపులు లాక్ చేస్తుంది మల్లిక. వెంటనే మైరావతి దగ్గరికి వెళ్లి జానకి, రామా.. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉన్నారని.. చాలా సేపు అయింది అని చెబుతుంది. ఇంతలో రామా, జానకి.. ఇద్దరూ ఏకాంతంగా ఉంటారు. రామా తనకు కిస్ చేయబోతాడు. ఇంతలో మైరావతి డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది