Janaki Kalaganaledu 7 Nov Today Episode : మైరావతి ముందు అడ్డంగా బుక్ అయిన జానకి.. తొలి రోజే జానకిని ఇంట్లో నుంచి జ్ఞానాంబ పంపించేస్తుందా?
Janaki Kalaganaledu 7 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ప్రతి శనివారం, ఆదివారం ప్రసారం కాదు. ఈ సీరియల్ కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం, 8 నవంబర్ 2021, 166 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి ఫ్రెండ్ శ్రావణి వచ్చి జ్ఞానాంబను నిలదీసిన విషయం తెలిసిందే. దీంతో జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. ఇవన్నీ నువ్వు మాట్లాడించావు కదా అంటుంది. కానీ.. జానకి మాత్రం.. శ్రావణి మాటలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెబుతుంది. చూస్తాను.. ఇంకా 14 రోజుల సమయం ఉంది కదా. 14 రోజులు అయిపోయాక నేను చెబుతాను నీ సంగతి అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అసలు జానకి మాటను ఎవ్వరూ పట్టించుకోరు.

janaki kalaganaledu serial 7 november 2021 episode
అసలు జానకి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో జ్ఞానాంబకు అస్సలు అర్థం కాదు. ఏం చేయాలో తోచదు. దీంతో గోవిందరాజు మైరావతి గురించి చెబుతాడు. మైరావతి ఎవరో కాదు.. జ్ఞానాంబ అత్తయ్య. అంటే గోవిందరాజు తల్లి. జానకి గురించి సరైన నిర్ణయం తీసువకోవాలంటే అమ్మే కరెక్ట్ అని జ్ఞానాంబతో గోవిందరాజు చెబుతాడు. దీంతో జ్ఞానాంబ కూడా అదే కరెక్ట్ అనుకుంటుంది. జానకి రాముడికి తగిన భార్య అవునో కాదో పరీక్షించడానికి నువ్వు 15 రోజులు ఇచ్చావు కానీ.. తనను నువ్వు ఎలా పరీక్షిస్తావు అని అడుగుతాడు. దీంతో వెంటనే అత్తయ్య గారికి ఫోన్ చేయండి అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu serial 7 november 2021 episode
వెంటనే మైరావతితో మాట్లాడుతుంది జ్ఞానాంబ. అసలు విషయం చెబుతుంది. జానకి చదువు విషయం చెబుతుంది. జానకి మంచి అమ్మాయే కానీ.. భవిష్యత్తులో ఏదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. నా కొడుకు రామా భవిష్యత్తు అంధకారంలో ఉందని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ ఎందుకు. నేను జానకి విషయం నేను చూసుకుంటానులే అని చెబుతుంది మైరావతి. జానకిని తీసుకొని ఎల్లుండి దీపావళి నోములుకు రండి.. అక్కడే 15 రోజుల పాటు ఉంచుకొని జానకి గురించి నా అభిప్రాయాన్ని చెబుతాను అని అంటుంది మైరావతి. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి మైరావతి ఇంటికి వెళ్తారు.
Janaki Kalaganaledu 7 Nov Today Episode : మైరావతి గురించి ముందే జానకికి చెప్పిన మల్లిక
అయితే.. మైరావతి అసలు స్వరూపం ఏంటో.. మైరావతి ఎటువంటిదో ముందే జానకికి చెబుతుంది మల్లిక. మైరావతికి ఎవరైనా మోసం చేసినా.. అబద్ధం చెప్పినా అస్సలు నచ్చదు అని చెబుతుంది. దీంతో జానకి తెగ టెన్షన్ పడుతుంది. తప్పని పరిస్థితుల్లో మైరావతి ఇంటికి వెళ్తుంది జానకి. వెళ్లగానే మమ్మల్ని ఆశీర్వదించు నానమ్మ అని తన కాళ్ల మీద పడతాడు రామా. వెంటనే దీవిస్తుంది. జానకి కూడా తన కాళ్ల మీద పడుతుంది కానీ.. తల వంచి నమస్కరించదు. దీంతో ఇదేనా నీ సంస్కారం. పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు తల వంచి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకోవాలని తెలియదా అంటూ గట్టిగా అడుగుతుంది మైరావతి. దీంతో నిజంగా నాకు తెలియదండి.. నన్ను క్షమించండి అని తల వంచబోతుంది జానకి. కానీ.. జానకిని ఆశీర్వదించకుండానే వెళ్లు వెళ్లు అంటూ అక్కడి నుంచి పంపిస్తుంది మైరావతి. ఇంటికి వెళ్లిన మొదటి రోజే జానకికి షాక్ తగలడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.