Janaki Kalaganaledu 27 Oct Today Episode : జ్ఞానాంబ చేసే పనులకు జానకికి చిరాకు వస్తుందా? రామాతో పాటు ఇల్లు వదిలి వెళ్లిపోతుందా?
Janaki Kalaganaledu 27 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 27 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తనతో జ్ఞానాంబ మాట్లాడటం లేదని రామా చాలా బాధపడతాడు. చివరకు తనతో కాళ్లు కూడా పట్టించుకోదు జ్ఞానాంబ. దీంతో వెక్కి వెక్కి ఏడుస్తాడు రామా. బతకడం కన్నా చావడం మేలు అని అనుకుంటాడు రామా. దీంతో గోవిందరాజు ఏంటి జ్ఞానాంబ ఇది.. అని అంటాడు. కానీ.. ఏం చెప్పదు. పడుకోండి అంటుంది. దీంతో గోవిందరాజు కూడా పడుకుంటాడు.

janaki kalaganledu 27 october 2021 full episode
జ్ఞానాంబ రూమ్ నుంచి బయటికి రాగానే జానకి అక్కడ నిలబడి ఉంటుంది. తనను చూసి గట్టిగా హత్తుకుంటాడు రామా. జానకి గారు అమ్మ.. మీకు తెలుసు కదండి. ప్రతిరోజు అమ్మకు పడుకునే ముందు కాళ్లు పడతాను. లేకపోతే నేను ఏదో పోగొట్టుకున్నవాడిని అయిపోతాను అని తెలుసు కదా. ఇక నుంచి కాళ్లు పట్టాల్సిన అవసరం లేదని అమ్మ చెప్పింది. అమ్మకు సేవ చేయకుండా నేను ఉండగలనా? ఆ బాధ నేను భరించగలనా? నా వల్ల ఎక్కడ అవుతుంది అండి. మా అమ్మ నా ముఖాన్ని కూడా చూడలేదు అండి. నాకు అంతకంటే బాధ ఇంకేమన్నా ఉంటుందా? భయమేస్తుంది జానకి గారు. చాలా చాలా భయమేస్తుంది. అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో బాధ కలిగితే అంతే బాధగా ఉంటుంది.
Janaki Kalaganaledu 27 Oct Today Episode : జానకిని ఇంకా జ్ఞానాంబతో తిట్టించేందుకు మల్లిక ప్లాన్
ఉదయమే జానకి ఇంటి బయట ముగ్గు వేస్తుంటుంది. జానకిని చూసిన మల్లిక అమ్మో.. ముగ్గు వేస్తుందా? తనకు ఇంకో జలక్ ఇవ్వాలి అనుకొని… జానకి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య గారు చెప్పినట్టు రోజూ వేస్తున్నా కదా ముగ్గు అంటుంది. ఇంతకు ముందు వేరు.. అసలు నిన్ను కోడలుగా కూడా అంగీకరించడం లేదు. అత్తయ్య గారి దృష్టిలో నువ్వు ఎప్పటికైనా వెళ్లిపోయే అతిథివే. ఈరోజు నుంచి నువ్వు ముగ్గు వేయడానికి వీలు లేదు. ముగ్గు వేశావంటే అస్సలు బాగుండదు.. అంటూ ఇవి నా డైలాగులు కాదు.. అత్తయ్య గారి డైలాగులు.. ఆవిడ చెప్పమన్నారు… నేను చెప్పాను అంటుంది మల్లిక.

janaki kalaganledu 27 october 2021 full episode
జానకి ముగ్గేస్తూ లీలావతి పెద్దమ్మను చూస్తుంది. జానకి చదువు గురించి ఇంకా అందరికీ చెప్పాలని మరో ప్లాన్ వేస్తుంది. లీలావతితో జానకి చదువు విషయం చెప్పి జ్ఞానాంబను నిలదీయు అంటుంది. సరే.. తర్వాత వచ్చి నిలదీస్తా అని చెప్పి మల్లిక దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని వెళ్తుంది.
ఉదయం లేవగానే అందరూ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నం అవుతారు. ఇంతలో జానకి కాఫీ తీసుకొచ్చి జ్ఞానాంబకు ఇస్తుంది. తను తీసుకోదు. ఇంతలో కట్టెలు కొడుతున్న రామా చేతికి గాయం అవుతుంది. రక్తం కారుతున్నా కూడా రామాను చూసి దగ్గరికి రాదు జ్ఞానాంబ. జానకే రామాకు కట్టుకడుతుంది. దీంతో రామా చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.