Janhvi Kapoor : జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు బ్రేక్ అనేదే లేదా..?
Janhvi Kapoor: శ్రీదేవి అందాల తనయగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పుడు మాత్రం తనకంటూ సపరేట్ ఐడెంటిటీ ఏర్పరచకుంది. ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని అందిపుచ్చుకుంది. ఒకటికి మంచి మరొకటి అన్నట్టు.. ఉన్నాయి జాన్వీ ఫోజులు…ఒక డ్రెస్‌పై ఫొటో షూట్‌ని చూసి మైమరచిపోయే లోపు మరి కొన్ని ఫొటోలని షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె శేర్ చేసే ఫొటోలలో ఒకదానికి మించి మరొకటి.. అంతకు మించి అన్నట్టు ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా.. జాన్వీ కపూర్ రీసెంట్ ఫోటో షూట్ మగమనసులకు పిచ్చెక్కిస్తుంది.
ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే.. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్ బాగా అవసరం. దీన్ని గుర్తించిన జాన్వీ చక్కగా వాడుకుంటుంది. ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న జాన్వీ కపూర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ ట్రెండీ దుస్తులలో చాలా క్యూట్‌గా కనిపించింది. జాన్వీని ఇలా చూసి ప్రతి ఒక్కరు అమ్మడిపై మనసు పారేసుకుంటున్నారు. శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది.

janhvi kapoor blue color dress looks viral
Janhvi Kapoor : తగ్గేదే లే..
త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం ఎన్టీఆర్ 31వ సినిమాకి జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొణెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో.. వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటం వలన, జాన్వీని సంప్రదించడం జరిగింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. నవంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.