Janhvi Kapoor : కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2025,6:00 pm

Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన అందం, ఆకర్షణీయతతో అందర్నీ కట్టిపడేసింది. ఆమె నటనా పరంగా మాత్రమే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటింది. శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జాన్వీ, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది.

ప్రపంచ ప్రఖ్యాత నటీనటులు హాజరయ్యే ఈ వేడుకలో జాన్వీ మెటాలిక్ ప్రీ-డ్రేప్డ్ సారీతో రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించగా, ఆ దుస్తుల్లో జాన్వీ అందర్నీ కట్టిపడేసింది. ‘హోమ్‌బౌండ్’ అనే చిత్ర ప్రీమియర్ కోసం కేన్స్‌కి వచ్చిన జాన్వీ, అక్కడి వాతావరణానికి తగినంతగా ఆహ్లాదకరమైన ఎలిగెన్స్‌ని ప్రదర్శించింది.

Janhvi Kapoor కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్

ఆమె రాగానే మీడియా ప్రతినిధులు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు. ఈ ఫెస్టివల్‌లో జాన్వీ నటన కాకుండా, ఆమె ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా ప్రధాన ఆకర్షణగా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది