Janhvi Kapoor : చలికాలం చెమటలు పట్టించేలా.. అందానికి కేరాఫ్ అడ్రెస్ జాన్వీ కోసం హృదయాలను రాసిచ్చేయడమే..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 22, 2022, 6:30 pm

Janhvi Kapoor : శ్రీదేవి తనయ జాన్వి కపూర్ బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని చూస్తుంది. చేస్తున్న సినిమాల ఫలితాలు అటు ఇటుగా ఉన్నా సరే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో టాప్ లేచిపోయే అందంతో అమ్మడు రచ్చ చేస్తుంది. గ్లామర్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో లెక్క ఉంటుంది. అందరికి భిన్నంగా జాన్వి ఉంటుంది. ఏదో స్కిన్ షో చేశామంటే చేశాం అన్నట్టు కాకుండా గ్లామర్ ఎటాక్ లో కూడా నావెల్టీ కనిపిస్తుంది.

లేటెస్ట్ గా చాక్లెట్ కలర్ డ్రెస్ తో థైస్ షోస్ చేస్తూ అదరగొట్టింది జాన్వి కపూర్. రోజుకొక కొత్త ఫోటో షూట్ తో జాని కపూర్ అందాల ప్రదర్శనలో నో లిమిట్స్ అనేలా చేస్తుంది. బాలీవుడ్ లో తన మార్క్ చూపించేలా ప్రయత్నిస్తున్న అమ్మడు త్వరలో మిలి సినిమాతో రాబోతుంది. అది మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి రీమేక్ గా వస్తుందిక్. జాన్వి కపూర్ కి తెలుగులో కూడా నటించాలని ఆసక్తి చూపిస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటించేందుకు రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు టాలీవుడ్ లో సరైన ఛాన్స్ వస్తే తప్పక చేస్తా అంటుంది. శ్రీదేవి కూడా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నాక బాలీవుడ్ కి వెళ్లింది.

janhvi kapoor latest photoshoot  viral in Social Media

janhvi kapoor latest photoshoot  viral in Social Media

ఇక ఇప్పుడు రివర్స్ లో జాన్వి కపూర్ హిందీ సినిమాలు చేస్తూ సౌత్ సినిమాలు చేయాలని అనుకుంటుం ది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల మీద జాన్వి కపూర్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎన్.టి.ఆర్, మహేష్ సినిమాల్లో అమ్మడి పేరు చర్చల్లోకి వచ్చినా సరే మళ్లీ ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదు. మరి రానున్న రోజుల్లో అయినా జావి టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఆశించవచ్చు. సినిమాలేమో కానీ తన హాట్ ఫోటో షూట్స్ తో మాత్రం తెలుగు ఆడియన్స్ కి దగ్గర అవుతుంది జాన్వి. అమ్మడి లేటెస్ట్ ఫోటో చలికాలం కూడా చెమటలు పట్టించేలా ఉంది. అంతేనా ఆమెకోసం ఆమె ఫ్యాన్స్ హృదయాలను రాసిచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp