Janhvi Kapoor : మోడ్రన్ డ్రెస్‌లో ఆ అందాలు బయటపెట్టి.. కుర్రకారు మతి పోగొడుతున్న జాన్వి కపూర్
Janhvi Kapoor : దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వికపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. తొలి చిత్రం ‘ధడక్’ చూసి ప్రేక్షకులు శ్రీదేవి పోలికలను చూసి ఆనంద పడిపోయారు. ఇక ఆ తర్వాత కాలంలోనూ జాన్వికపూర్ సెలక్టెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.ఇకపోతే జాన్వికపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటుంటుంది.

janhvi kapoor photos viral in social media
తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అందమైన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో జాన్వికపూర్ పింక్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించి ఉంది. టాప్ టు బాటమ్ మోడ్రన్ లుక్‌లో టామ్ బోయ్‌లా జాన్వికపూర్ స్టైలిష్ లుక్స్ ఇచ్చింది. పింక్ కలర్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా పింక్ లిప్ స్టిప్ పెట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ హొయలు పోయింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్.
Janhvi Kapoor : పింక్ డ్రెస్‌లో టామ్ బోయ్ లుక్స్‌తో అదరగొడుతున్న జాన్వి..

janhvi kapoor Latest Pics Viral
ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘అందాల ముద్దుగుమ్మ, ప్రెట్టీ లుక్స్, బ్యూటిఫుల్ గర్ల్, లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు. జాన్వికపూర్ సంప్రదాయ వస్త్రాల్లోనూ అందంగా ఉంటుందని ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు పోస్టులు పెడుతున్నారు. జాన్వికపూర్ ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ప్రజెంట్ ‘దోస్తానా2, మిలి’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నది.