Janhvi Kapoor : ఆ విషయంలో సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్న జాన్వీ కపూర్… ఫిలిం మేకర్స్ షాక్

 Authored By prabhas | The Telugu News | Updated on :31 January 2023,10:00 am

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లోనే నటించింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు సక్సెస్ ని తెచ్చిపెట్టలేక పోయాయి. అయినా కూడా జాన్వీ కపూర్ హిందీలో వరుసగా సినిమాలను సొంతం చేసుకుంటూనే ఉంది. కానీ రెమ్యూనరేషన్‌ మాత్రం చాలా తక్కువ తీసుకుంటుంది అనేది సమాచారం. ఈ సమయంలోనే జాన్వీ కపూర్ కి తెలుగు నుండి కూడా పిలుపు వచ్చింది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పోతున్న సినిమాకు సంబంధించిన ఫిలిం మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారట. మరో వైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న

Janhvi Kapoor remuneration issue viral in telugu media

Janhvi Kapoor remuneration issue viral in telugu media

సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ నటించడం దాదాపుగా ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఒక వైపు బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి.. అక్కడ అవకాశాలు రావడమే గగనంగా మారింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో ఈమె నటించేందుకు ఏమాత్రం మొహమాట పడకుండా కనీసం సిగ్గు పడకుండా ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకున్న డిమాండ్ నేపథ్యంలో భారీ పారితోషికంను పొందాలి అనుకోవడం తప్పేం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Janhvi Kapoor remuneration issue viral in telugu media

Janhvi Kapoor remuneration issue viral in telugu media

జాన్వీ కపూర్ యొక్క కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమె తీరుని తప్పుపడుతున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హిందీలో ఎలాగో సక్సెస్ లు రావడం లేదు కనుక తెలుగులో అయినా భారీగా సక్సెస్ లు సొంతం అయ్యేలా వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. భారీ పారితోషికం డిమాండ్ చేసి ఫిలిం మేకర్స్ కి షాక్ ఇవ్వకుండా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువ సినిమాలు చేయాలని చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు ముందు అయినా జాన్వీ కపూర్ తన యొక్క రెమ్యూనరేషన్ తగ్గించుకొని ఎక్కువ సినిమాల్లో నటిస్తుందా అనేది చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి