Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లోనే నటించింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు సక్సెస్ ని తెచ్చిపెట్టలేక పోయాయి. అయినా కూడా జాన్వీ కపూర్ హిందీలో వరుసగా సినిమాలను సొంతం చేసుకుంటూనే ఉంది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువ తీసుకుంటుంది అనేది సమాచారం. ఈ సమయంలోనే జాన్వీ కపూర్ కి తెలుగు నుండి కూడా పిలుపు వచ్చింది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పోతున్న సినిమాకు సంబంధించిన ఫిలిం మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారట. మరో వైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న
సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ నటించడం దాదాపుగా ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఒక వైపు బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి.. అక్కడ అవకాశాలు రావడమే గగనంగా మారింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో ఈమె నటించేందుకు ఏమాత్రం మొహమాట పడకుండా కనీసం సిగ్గు పడకుండా ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకున్న డిమాండ్ నేపథ్యంలో భారీ పారితోషికంను పొందాలి అనుకోవడం తప్పేం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీ కపూర్ యొక్క కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమె తీరుని తప్పుపడుతున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హిందీలో ఎలాగో సక్సెస్ లు రావడం లేదు కనుక తెలుగులో అయినా భారీగా సక్సెస్ లు సొంతం అయ్యేలా వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. భారీ పారితోషికం డిమాండ్ చేసి ఫిలిం మేకర్స్ కి షాక్ ఇవ్వకుండా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువ సినిమాలు చేయాలని చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు ముందు అయినా జాన్వీ కపూర్ తన యొక్క రెమ్యూనరేషన్ తగ్గించుకొని ఎక్కువ సినిమాల్లో నటిస్తుందా అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.