Home » Entertainment » Upasana Konidela Invisible Baby Bump Is She Indeed Pregnant
Entertainment

Upasana Konidela : ఉపాసన బేబీ బంప్ కనిపించదేం, నిజంగానే ఈమె తల్లి కాబోతుందా? లేదా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 30, 2023 10:28 pm
Advertisement

Upasana Konidela : మెగా ఫ్యామిలీలో వారసుడు అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంగా రానే వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్న నేపథ్యంలో వారసుడు రాబోతున్నాడని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఉపాసన తల్లి కాబోతుంది అంటూ స్వయంగా చిరంజీవి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Upasana Konidela invisible baby bump is she indeed pregnant

చిరంజీవి ప్రకటించి ఇన్ని రోజుల తర్వాత కూడా ఉపాసన ఇంకా ఒక గర్భవతి అన్నట్లుగా కనిపించడం లేదంటూ గుసగుసలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సెలబ్రెటీలు గర్భం దాల్చిన తర్వాత చాలా నెలల కు అధికారికంగా బయటకు తెలియజేస్తారు. కనుక ఉపాసన విషయంలో కూడా మరో రెండు మూడు నెలల్లోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది భావించారు. కానీ ఉపాసన ఈ మధ్య వరుసగా ఏదో ఒక ఈవెంట్ లో కనిపిస్తూనే ఉంది. ఆ సందర్భంగా ఆమె బేబీ బంప్‌ ని చూడాలన్నా కనిపించడం లేదంటే కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Upasana Konidela invisible baby bump is she indeed pregnant

అసలు నిజంగా ఉపాసన గర్భవతేనా లేదంటే సరోగసి విధానం ద్వారా రామ్‌ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొందరు మాత్రం ఉపాసన తల్లి కాబోతుందని.. ఇంకా ఆమె డెలివరీ చాలా సమయం ఉంది కనుక బేబీ బంప్‌ కనపడటం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కాకున్నా మరి కొన్నాళ్లకైనా ఉపాసన బేబీ బంప్‌ కనిపించబోతుంది కదా ఎందుకంత తొందర అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జనాలను ప్రశ్నిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి