Jayasudha : ఇండస్ట్రీలో హీరోల గురించి మాట్లాడుతూ పవన్ ని ఉతికారేసిన జయసుధ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 10 March 2023, 5:00 pm

Jayasudha : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది టైముంది. సరిగ్గా ఎన్నికల టైంకి ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తమకు ఇష్టం వచ్చిన పార్టీలకు సపోర్ట్ చేస్తూ ప్రచారంలో కీలకంగా రాణిస్తారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ తొలి దినాలలో జయసుధ సపోర్ట్ చేయడం తెలిసిందే. వైయస్ జగన్ ని సపోర్ట్ చేస్తూ అప్పట్లో కీలకంగా రాణించారు. అంతకుముందు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి…

Jayasudha Comments On Pawan Kalyan Politics

Jayasudha Comments On Pawan Kalyan Politics

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… జయసుధ అని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ… సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించే దిశగా వ్యవహరించారు. ఈ క్రమంలో వైయస్సార్ మరణానంతరం జయసుధ రాజకీయంగా వైఎస్ జగన్ కి మద్దతు తెలపడం జరిగింది. ఆ సమయంలో మీడియా సమావేశం నిర్వహించి ఇండస్ట్రీలో పరిస్థితులు గురించి మాట్లాడుతూ…

పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ???????? : Jayasudha Comments On Pawan Kalyan About  Politics | NSE - YouTube

పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో దాదాపు 80 శాతం మంది వైయస్ జగన్ కి సపోర్ట్ గా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు అన్ని అవాస్తవమని.. ఖండిస్తూ జయసుధ ఉతికారేశారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఎంట్రీ ఇచ్చే సమయంలో..వ్యవహరించే తీరు పై వైసిపి పార్టీ తరఫున మీడియా సమావేశంలో జయసుధ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp