Jayasudha : జయసుధ చెప్పుతో కొట్టిందా ? బయటపడిన నమ్మలేని న్యూస్ !

 Authored By aruna | The Telugu News | Updated on :18 May 2023,10:00 am

Jayasudha : అలనాటి తార జయసుధ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. ఎన్నో సినిమాలలో సహజంగా నటించి పాత్రకు ప్రాణం పోశారు. దర్శకులు కూడా జయసుధ కోసం ప్రత్యేక పాత్రలు రాసుకునేవారు. మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతోనే కాకుండా నిన్నటి తరం చిరంజీవి లాంటి హీరోల సరసన కూడా నటించింది. ఇక జయసుధ ప్రస్తుతం సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలు చేస్తూ అలరిస్తూ వస్తుంది.

కేవలం తల్లి పాత్రలే కాకుండా హీరో హీరోయిన్లకు బామ్మ పాత్రలు కూడా నటిస్తుంది. ఇలా కొన్ని దశాబ్దాల నుంచి సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇకపోతే గతంలో జయసుధ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒక హీరోయిన్ చెప్పుతో కొట్టినట్లు ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జయసుధ హీరోయిన్ గా కృష్ణంరాజు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో కటకటాల రుద్రయ్య అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయసుధ తో పాటు మరో హీరోయిన్ జయచిత్ర కూడా నటించింది. అయితే ఇందులో ఒక సన్నివేశం జరిగిందట.

actress jayasudha shcking comments

actress jayasudha shcking comments

ఆ సన్నివేశంలో ఇద్దరి మధ్య చెప్పుల విషయంలో గొడవ జరిగుతుంది. నేను హై హీల్స్ వేసుకోవడం జయచిత్రకి అస్సలు నచ్చడం లేదు. దాంతో చెప్పులు విప్పేసి రా అని నా మొహం మీదే చెప్తుంది. ఆమె కోసం నేను హీల్స్ వేసుకోకుండా ఉండడం ఏంటి అని నాకు అనిపించింది .నేను విప్పను అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాను, ఇక అదే మనసులో పెట్టుకొని జయచిత్ర షూటింగ్ లో మేమిద్దరం కొట్టుకునే సన్నివేశంలో నన్ను గట్టిగా కొట్టింది. నేను కూడా ఊరుకోకుండా ఆ హీరోయిన్ ని నిజంగానే గట్టిగా చెప్పుతో కొట్టా. కానీ ఈ సన్నివేశం బాగా పండింది అంటూ జయసుధ గుర్తు చేసుకున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి