Anchor Suma : సుమకు చుక్కలు చూపించారు!.. జోగి బ్రదర్స్ వాయించి పడేశారుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : సుమకు చుక్కలు చూపించారు!.. జోగి బ్రదర్స్ వాయించి పడేశారుగా

 Authored By prabhas | The Telugu News | Updated on :30 May 2022,11:00 am

Anchor Suma : యాంకర్ సుమకు బుల్లితెరపై తిరుగుండదు. ఆమెకు సరిసాటిగా పంచులు వేసేవారు సాధారణంగా కనిపించదు. ఏ సెలెబ్రిటీ వచ్చినా సుమ పంచ్‌లకు బలవుతుంటారు. సుమ స్పాంటేనిటీ అలాంటిది. అయితే సుమ తాజాగా క్యాష్ షోలో వరుసగా పంచ్‌ల బారిన పడింది. వచ్చే వారానికి సంబంధించి క్యాష్ షో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సీనియర్ నటీనటులను తీసుకొచ్చింది. రాగిణి, కాదంబరి కిరణ్, కమెడియన్స్ జోగి బ్రదర్స్ వచ్చారు.ఇక జోగి బ్రదర్స్ వేసిన పంచ్‌లకు, డైలాగ్స్‌కు సుమ నోటి వెంట మాటే రాలేదు.

వరుసగా ఆమెను పంచ్‌లతో ఆడేసుకున్నారు. జోగి బ్రదర్స్ కౌంటర్లు వేస్తుంటే సుమ నోర్మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇన్నేళ్లలో కూడా అవే స్టెప్పులు అని జోగి బ్రదర్స్ మీద సుమ పంచ్ వేసింది. నువ్ ఏమైనా యాంకరింగ్ మార్చావా? అంటూ మొదటి పంచ్ వేయడంతో సుమ షాక్ అయింది. జోగి బ్రదర్స్ స్క్రీన్ వైపు చూస్తూ ముద్దులు విసిరారు. ఏంటా ముద్దులు.. ఇది ఫ్యామిలీ షో అని సుమ అంటే..మరి మా ఫ్యామిలీస్‌ను ఎందుకు పిలవలేదు అని కౌంటర్ వేస్తాడు.

Jogi Brothers Satires On Anchor Suma in Cash Show

Jogi Brothers Satires On Anchor Suma in Cash Show

దీంతో మరోసారి సుమకు పంచ్ పడింది. ఇది ఎన్నేళ్ల అనుబంధం అని సుమ అడిగితే.. ఓ 25 ఏళ్ల బంధం అని చెప్పుకొచ్చాడు.. నువ్ యాంకరింగ్ ఎప్పుడు మొదలుపెట్టావో అప్పుడు అని చెప్పడంతో సుమ సైలెంట్ అవుతుంది. ఇక మామిడితోట కలెక్షన్ కింగ్ అంటూ సుమ ఓ కాన్సెప్ట్ పెట్టింది. ఇక కాదంబరి కిరణ్ కూడా సుమ మీద పంచ్ వేశాడు. ఈ కాయలను చూస్తుంటే నీలాగే ముదిరిపోయినట్టు కనిపిస్తున్నాయని కౌంటర్ వేయడంతో సుమ షాక్ అవుతుంది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది