JR NTR : ఎన్టీఆర్ ముప్పై రెండో సినిమా ఎవరితోనో తెలిస్తే వెంట్రుకలు లేచి నుంచుంటాయి !
JR NTR ; ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజిఎఫ్, సలార్ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ 32 వ సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ వస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో తదుపరి సినిమాలన్నింటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాదు
బాలీవుడ్ నిర్మాతలు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్టీఆర్ 32వ సినిమాను ప్రముఖ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా ప్రారంభోత్సవానికి భూషణ్ కుమార్ ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చారు. మరోవైపు ఆయన ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కూడా స్టార్ డైరెక్టర్ సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.