Mahesh Babu Jr Ntr : బాలయ్య బాబు కోసం ఎన్టీఆర్, మహేశ్ బాబు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu Jr Ntr : బాలయ్య బాబు కోసం ఎన్టీఆర్, మహేశ్ బాబు..?

Mahesh Babu Jr Ntr : సాధారణంగా ఒకే వేదికపై ఇద్దరు అగ్రహీరోలు కనిపిస్తే ఇంకా ఏమైనా ఉన్నదా..? చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇక ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. తమ అభిమాన హీరోల కోసం వచ్చిన మరో అగ్రహీరోను సైతం చూసి విజిల్స్‌తో తెగ సందడి చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడో ఒకసారి మాత్రమే చోటుచేసుకుంటాయి. తాజాగా ఇటువంటి అద్బుత సన్నివేశం త్వరలోనే ప్రేక్షకులు చూడనున్నారు. నందమూరి నటసింహం […]

 Authored By mallesh | The Telugu News | Updated on :5 December 2021,2:20 pm

Mahesh Babu Jr Ntr : సాధారణంగా ఒకే వేదికపై ఇద్దరు అగ్రహీరోలు కనిపిస్తే ఇంకా ఏమైనా ఉన్నదా..? చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇక ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. తమ అభిమాన హీరోల కోసం వచ్చిన మరో అగ్రహీరోను సైతం చూసి విజిల్స్‌తో తెగ సందడి చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడో ఒకసారి మాత్రమే చోటుచేసుకుంటాయి. తాజాగా ఇటువంటి అద్బుత సన్నివేశం త్వరలోనే ప్రేక్షకులు చూడనున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే వేదిక పై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే ‘అఖండ’ సక్సెస్ మీట్..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరెకెక్కిన ‘అఖండ’ మూవీ భారీ విజయన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీలో ఉన్నారు. అఖండ సినిమా కలెకన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. వీకెండ్ కూడా రావడంతో వసూళ్లు భారీగానే ఉంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. సమీపంలో మరో సినిమా విడుదలకు రెడీగా లేకపోవడంతో మరో వారం పాటు అఖండ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. కరోనా కష్టకాలం తర్వాత విడుదలైన అగ్ర హీరో ఈ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర పరిశ్రమలోని పెద్ద హీరోలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలకు కూడా జనాలు వస్తారని, కొవిడ్ భయం పెద్ద ఆటంకం ఏమీ కాదనే ధీమాలో ఉన్నట్టు తెలుస్తోంది.

jr ntr and mahesh babu for balakrishna akhanda movie success meet

jr ntr and mahesh babu for balakrishna akhanda movie success meet

Mahesh Babu Jr Ntr : ఇరు ఫ్యాన్స్‌కు పండగే..

ఇకపోతే బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టగా.. ఈ నెల 8న సక్సెస్ మీట్ నిర్వహించాలని మూవీ యూనిట్ భావిస్తోందట.. ఈ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ అగ్ర హీరోలకు ఇన్విటేషన్ వెళ్లగా ఈ సక్సెస్ మీట్ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు అఖండ తో భారీ హిట్ అందుకోవడంతో బాబాయ్ కోసం అబ్బాయ్.. అభిమాన హీరో కోసం మహేశ్ బాబు వస్తారని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది