Jr NTR : పట్టుబట్టి ఆమెను రంగంలోకి దించుతున్న ఎన్టీఆర్‌.. ఆమె అంటే ఎందుకు అంత మోజు?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 February 2023, 10:00 am

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈనెల చివరలో అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి నెల నుండి సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుందని క్లారిటీ వచ్చింది. అధికారికంగా ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ 30 హీరోయిన్ విషయాన్ని ప్రకటించలేదు

Jr NTR asked Janhvi Kapoor to choose him in his film

Jr NTR asked Janhvi Kapoor to choose him in his film

కానీ ఇటీవలే శంషాబాద్ సమీపంలోని ఒక హోటల్ లో కొరటాల శివ ఆధ్వర్యంలో జాన్వీ కపూర్ యొక్క ఫోటో షూట్ నిర్వహించడం జరిగిందట.. ఆ ఫోటో షూట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు అనేది సమాచారం అందుతోంది. జాన్వీ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ కి మంచి టాక్ రావడంతో కొరటాల శివ ఆమెను ఓకే చేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొందరు పట్టుబట్టి కొరటాల శివకు ఇష్టం లేకుండా కూడా ఎన్టీఆర్ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

Jr NTR asked Janhvi Kapoor to choose him in his film

Jr NTR asked Janhvi Kapoor to choose him in his film

ఎన్టీఆర్ గతంలో కూడా కొంత మంది హీరోయిన్స్ విషయంలో ఇలాగే పట్టుబట్టాడని, ఇప్పుడు జాన్వీ కపూర్ తన సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ పంతం నెగ్గించుకున్నాడని సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు కొరటాల శివ సన్నిహితులు వాదిస్తున్నారు. కొరటాల శివ ఆ మధ్య జాన్వీ ఎంపిక స్వయంగా తన నిర్ణయం అన్నట్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి