JR NTR : అంత పెద్ద సినిమాకి ఎన్టీఆర్ ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తి చేశాడా..!
JR NTR : తన తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. ఆయన తొలిసారి రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దానికి తోడు ఎన్టీఆర్ తన తెలుగు డబ్బింగ్ పూర్తి చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పట్టిందని చెప్పాడు. హిందీకి రెండు రోజులు, తమిళ్ డబ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నాడని వెల్లడించారు.
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం).. 2020లోనే రావాల్సిన సినిమా.. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు రెండేళ్ల తర్వాత మార్చి 25న రిలీజవుతోంది.
JR NTR : అంచనాలు పెంచుతున్న ఇంటర్వ్యూలు..
అతి భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టించనుంది? గతంలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను బద్ధలు కొడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చాడో సినీ విమర్శకుడు. ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సినిమా రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్ చూసేశానంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. దీంతో సినిమాపై అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.