Devara Movie : దేవర హిందీ వెర్షన్.. రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devara Movie : దేవర హిందీ వెర్షన్.. రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 September 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  Devara Movie : దేవర హిందీ వెర్షన్.. రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు..!

Devara Movie : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. మరో నటి శృతి మరాఠే కూడా ఇందులో భాగమైంది. దేవర సినిమాలో ఎన్ టీ ఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ అవుతున్న దేవర హిందీ వెర్షన్ ని నిర్మాతలు ఓన్ రిలీజ్ చేస్తున్నారు. దేవర సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్ టీ ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించారు. హిందీ వెర్షన్ కు భారీ ఆఫర్లు వచ్చినా నిర్మాతలు మాత్రం సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా సినిమా హిందీలో రిలీజ్ అవుతుంది. ఐతే హిందీ వెర్షన్ టికెట్లు రెండు రోజుల ముందు మాత్రమే ఉంచడంతో కేవలం అక్కడ ప్రీ సేల్స్ ఎంత బాగున్నా 11 కోట్లు మాత్రమే వచ్చాయి.

Devara Movie హిందీ రైట్స్ 50 కోట్లు..

దేవర హిందీ వెర్షన్ వేరే వాళ్లకి ఇచ్చినట్టైతే తప్పకుండా 50 కోట్ల దాకా వచ్చేవి. కానీ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఐతే టికెట్స్ అయినా నాలుగు రోజు ముందు నుంచి పెడితే బాగుండేది కానీ అలా కూడా చేయలేదు. దేవర హిందీ వెర్షన్ నుంచి 100 కోట్ల దాకా రాబట్టాలని చూస్తున్నారు.

Devara Movie దేవర హిందీ వెర్షన్ రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు

Devara Movie : దేవర హిందీ వెర్షన్.. రిస్క్ అని తెలిసినా సరే వెనక్కి తగ్గలేదు..!

ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో తారక్ అదరగొట్టాడు కాబట్టి సోలోగా దేవరతో వస్తున్న ఎన్ టీ ఆర్కు కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ హిట్ దక్కుతుందని అనుకుంటున్నారు.. ఎన్ టీ ఆర్ మాత్రం దేవర సక్సెస్ మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. జాన్వి, సైఫ్ ల క్రేజ్ కూడా హిందీలో దేవర మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. సో దేవరకు హిట్ టాక్ వస్తే హిందీలో కూడా భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది