Jr NTR : యాక్షన్ డైరెక్టర్ వి.వి.వినాయక్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఆది’ అందరికీ తెలిసే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని సినీ వర్గాలు అంటుంటాయి. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా తిరగరాసింది. ఏకంగా 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడి సత్తా చాటింది.డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమా ద్వారానే తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఈ సినిమా కంటే ముందర వినాయక్ తెలుగు చిత్రసీమలో పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఈ క్రమంలోనే తాను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అందుకుగాను స్టోరి రెడీ చేసుకుని ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జీ) బ్యానర్‌లో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. అలా రెడీ చేసుకున్న పిక్చర్ స్టోరి ‘ఆది. కాగా, తొలుత ఈ సినిమాలో హీరోగా బాలయ్య ఉండాలని డైరెక్టర్ వినాయక్ భావించారట.వినాయక్ స్టోరి ప్రకారం.. ఆది కథలో ఇద్దరు బాలయ్యలు ఉంటారు. అందులో ఓ బాలకృష్ణ పాత్ర విలన్స్‌పై చిన్నపుడే బాంబులు విసురుతుంటుంది.ఇక పెద్ద బాలయ్య పాత్ర పోలీస్ అయ్యాక తన తమ్ముడిని చితక్కొట్టాల్సి వస్తుందట.
అలా ఈ కథలో సుమోలు గాల్లోకి ఎగిరేలా ప్లాన్ చేశారు వినాయక్. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి రాగా, ఆ సీన్స్ అన్నిటికీ జూనియర్ ఎన్టీఆర్‌కు అడాప్ట్ చేశారు వినాయక్. అలా తారక్ తర్వాత సినిమా కథలోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కీర్తి చావ్లా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ ఫిల్మ్ తర్వాత వినాయక్ తన రెండో సినిమా ‘చెన్న కేశవరెడ్డి’ని బాలకృష్ణతో చేశారు. అది అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని వినాయక్ బాధపడ్డారట. కానీ, ఆ చిత్రం కమర్షియల్‌గా బాగానే సక్సెస్ అయింది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.