Jr NTR : ‘ఆది’ కథకు జూనియర్ ఎన్టీఆర్ కాకుండా.. ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : ‘ఆది’ కథకు జూనియర్ ఎన్టీఆర్ కాకుండా.. ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?

Jr NTR : యాక్షన్ డైరెక్టర్ వి.వి.వినాయక్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఆది’ అందరికీ తెలిసే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని సినీ వర్గాలు అంటుంటాయి. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా తిరగరాసింది. ఏకంగా 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడి సత్తా చాటింది.డైరెక్టర్ వి.వి.వినాయక్‌ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,7:40 pm

Jr NTR : యాక్షన్ డైరెక్టర్ వి.వి.వినాయక్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఆది’ అందరికీ తెలిసే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఈ సినిమా ద్వారా బయటకు వచ్చిందని సినీ వర్గాలు అంటుంటాయి. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా తిరగరాసింది. ఏకంగా 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడి సత్తా చాటింది.డైరెక్టర్ వి.వి.వినాయక్‌ ఈ సినిమా ద్వారానే తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Jr NTR : ఆయన వల్లే సినిమా కథ తారక్ వద్దకు వచ్చింది..!

jr ntr do you know who is the hero for aadi movie intially

jr ntr do you know who is the hero for aadi movie intially

ఈ సినిమా కంటే ముందర వినాయక్ తెలుగు చిత్రసీమలో పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఈ క్రమంలోనే తాను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అందుకుగాను స్టోరి రెడీ చేసుకుని ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జీ) బ్యానర్‌లో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. అలా రెడీ చేసుకున్న పిక్చర్ స్టోరి ‘ఆది. కాగా, తొలుత ఈ సినిమాలో హీరోగా బాలయ్య ఉండాలని డైరెక్టర్ వినాయక్ భావించారట.వినాయక్ స్టోరి ప్రకారం.. ఆది కథలో ఇద్దరు బాలయ్యలు ఉంటారు. అందులో ఓ బాలకృష్ణ పాత్ర విలన్స్‌పై చిన్నపుడే బాంబులు విసురుతుంటుంది.ఇక పెద్ద బాలయ్య పాత్ర పోలీస్ అయ్యాక తన తమ్ముడిని చితక్కొట్టాల్సి వస్తుందట.

అలా ఈ కథలో సుమోలు గాల్లోకి ఎగిరేలా ప్లాన్ చేశారు వినాయక్. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి రాగా, ఆ సీన్స్ అన్నిటికీ జూనియర్ ఎన్టీఆర్‌కు అడాప్ట్ చేశారు వినాయక్. అలా తారక్ తర్వాత సినిమా కథలోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కీర్తి చావ్లా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ ఫిల్మ్ తర్వాత వినాయక్ తన రెండో సినిమా ‘చెన్న కేశవరెడ్డి’ని బాలకృష్ణతో చేశారు. అది అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని వినాయక్ బాధపడ్డారట. కానీ, ఆ చిత్రం కమర్షియల్‌గా బాగానే సక్సెస్ అయింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది