JR Ntr : ప్రభాస్ , అల్లూ అర్జున్ ఇద్దరినీ మించేలా జూనియర్ ఎన్టీఆర్ PAN INDIA ప్లాన్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR Ntr : ప్రభాస్ , అల్లూ అర్జున్ ఇద్దరినీ మించేలా జూనియర్ ఎన్టీఆర్ PAN INDIA ప్లాన్ !

JR Ntr : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి ‘ వార్ 2 ‘ లోనటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 July 2023,2:00 pm

JR Ntr : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి ‘ వార్ 2 ‘ లోనటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో నిర్మిస్తోంది. వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. యంగ్ టైగర్ బాలీవుడ్ డెబ్యూ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హృతిక్ , తారక్ కాంబినేషన్ లో సినిమా అనేది ఊహకు కూడా రాలేదు. ప్రేక్షకాభిమానులకు ఇది ఊహించని సర్ప్రైజ్. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ తారక్ కోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తున్నట్లు రివిల్ చేశారు. ఓవైపు వైఆర్ఎఫ్ భారీ సినిమాలను ఖాన్ హీరోలతో నిర్మిస్తూనే ఈ కాంబినేషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పటివరకు వైఆర్ఎఫ్ స్పేవర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ సహా కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా చేరుతున్నారు.

JR Ntr entry to Bollywood

JR Ntr entry to Bollywood

ఈ సినిమా కోసం తారక్ భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ వైఆర్ఎఫ్ గేమ్ ప్లాన్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాని హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా హిట్ అయితే భారీగా వసూళ్లు వస్తాయి. దీని ద్వారా వైఆర్ఎఫ్ టాలీవుడ్ లో అధికారికంగా లాంచ్ అయినట్లు అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోవాలని వైఆర్ఎఫ్ తారక్ ని ఓ పావులా వినియోగించుకుంటుందని తెరపైకి వస్తుంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు తెలుగు హీరోని తెరపైకి తెచ్చిందంటే గేమ్ ప్లాన్ అర్థం కాలేదా అంటూ గుసగుసలు వస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది