Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ మాములు కాదు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న ఎన్టీఆర్ 30 త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బస్తీ నుంచి చదువుకుని మంచి మెరిట్ స్టూడెంట్‌గా ఎదుగుతారు. అయితే తర్వాత రాజకీయాలు, రాజకీయ నాయకులు వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు వారికి అండగా ఎన్టీఆర్ నిలబడి పోరాటం చేసేశాడనేదే కథ అని టాక్.
ఈ సినిమాలో కొరటాల శివ ఎక్కువగా పొలిటికల్ టచ్ ఇస్తున్నారని సమాచారం. ఇలా సినిమాలే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఎన్టీఆర్ ప్రజా సమస్యలపై పోరాడాలని అభిమానులు కోరుతున్నారు. ఆయన రాజకీయాలలోకి రావాలంటూ కోరుతున్నారు. అయితే తాజగా నందమూరి అభిమాని శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామానికి చెందిన జె.సురేష్ గౌడ్ జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. గత 15ఏళ్లుగా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాడు.ఎన్టీఆర్ కుమారుడి పేరు అభిరామ్ పేరును తన కుమారునికి పెట్టుకొని వీరాభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా తన అభిమాన హీరో ఆయురారోగ్యాలతో ఉండాలని
, రాబోయే కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజలకు మంచి చేయాలని, తన తాత పేరు నిలబెట్టాలని గున్ముక్ల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టాడు. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ని కలవడమే తన జీవితాశయమని సురేష్ చెబుతున్నాడు. మరి అతని కోరిక నెరవేరి , ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది జరుగుతుందా అనేది చూడాలి. ఎన్‌టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా తాను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. ఇప్పటికే జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ప్రతీ భాషా ప్రేక్షకుడికి దగ్గరయ్యాడు ఎన్‌టీఆర్. అందుకే కొరటాల శివ తన అప్‌కమింగ్ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.