Jr Ntr : కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్…!
Jr Ntr : యంగ్ టైగర్ NTR, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ RRR కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరు హీరోల క్రేజ్ కూడా ఓ రేంజ్‌లో పెరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ‘బాహుబలి’ని మించి ఉంటుందని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందులోనూ ఇద్దరు అగ్రహీరోలు.. ఒకరు నందమూరి, మరోకరు మెగా పవర్ స్టార్ కావడంతో వీరి ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండాలని దర్శకుడు రాజమౌళి భావించినట్టు తెలుస్తోంది.
Jr Ntr : ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల సినిమా..
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాంచరణ్ అండ్ తారక్‌లు వరుస సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. తారక్ తన తర్వాతి ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలిసింది. కొరటాల చెప్పిన కథకు తారక్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గ్రౌండ్ వర్క్ జరుగుతోందట.. ఈ మూవీ కోసం ముగ్గురు దిగ్గజ రచయితలు రంగంలోకి దిగారని టాక్.. మరోవైపు తారక్‌కు సరైన జోడి కోసం దర్శకుడు శివ వెతుకుతున్నారని తెలిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా మరో హీరోయిన్ ను కూడా సంప్రదించినట్టు తెలిసింది.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట.. జాన్వీ కూడా టాలీవుడ్‌లో అవకాశం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ జాన్వీని ఈ మూవీ కోసం సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అనుకున్నవి అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జాన్వీకి NTR సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. కాగా, ఈ మూవీ 2022 సమ్మర్‌లో విడుదలకు మూవీ యూనిట్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.