JR NTR : కొమురం భీముడో సాంగ్ .. కిస్ మీ యాడ్ వ‌ర్షెన్‌లోకి మారితే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : కొమురం భీముడో సాంగ్ .. కిస్ మీ యాడ్ వ‌ర్షెన్‌లోకి మారితే..!

JR NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలోని ప్ర‌తి పాట ఆణిముత్యాలే. నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టించ‌గా, కొమురం భీముడో అంత‌కు మించి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 September 2022,7:30 pm

JR NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలోని ప్ర‌తి పాట ఆణిముత్యాలే. నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టించ‌గా, కొమురం భీముడో అంత‌కు మించి అన్న‌ట్టుగా సాగింది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాణీ కొడుకు భైరవ పాడారు.
అదిరిపోయింది..

అయితే ఈ పాట చూస్తున్నంత సేపు ప్ర‌తి ఒక్క‌రు ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. ఈ పాటతో ఎన్టీఆర్ త‌న న‌ట విశ్వ‌రూపం మొత్తం చూపించాడు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ చూపించిన హావ భావాలు చూసి కంట‌తడి పెట్టని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ సాంగ్ ఇప్ప‌టికీ ఏదో ఒక మూల ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన‌ కొత్త వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ కొమురం భీముడో పాట‌కు డైరీ మిల్క్ యాడ్లోని కిస్ మీ క్లోజ్ యువ‌ర్ ఐస్ సాంగ్‌ని మిక్స్ చేసిన ఎడిటింగ్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ సాంగ్‌కు ఎన్టీఆర్ లిప్ మూవ్‌మెంట్ క‌రెక్ట్ గా సింక్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైనకొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఆస్కార్ నామినేష‌న్‌లోకి కూడా వెళ్లాడు. ఇక ప్ర‌స్తుతం జూనియ‌ర్ కొర‌టాల శివ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది