WAR 2 Movie Official Teaser : ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చింది.. వార్ 2 టీజ‌ర్‌తో అంచానాలెన్నో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WAR 2 Movie Official Teaser : ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చింది.. వార్ 2 టీజ‌ర్‌తో అంచానాలెన్నో

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  WAR 2 Movie Teaser : ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చింది.. వార్ 2 టీజ‌ర్‌తో అంచానాలెన్నో

WAR 2 Movie Official Teaser : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కి ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ‘వార్ 2’ టీజర్ కోసం ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా, ఈ టీజ‌రం నచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు లుక్ స్టైలిష్‌గా ఉంది. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా సినిమా సాగుతుందని అర్థం అవుతోంది. కానీ టీజర్ ఒక్క విషయంలో డిజప్పాయింట్ చేసింది. వీఎఫ్ఎక్స్ అసలు బాలేదని ట్విట్టర్ అంతా హోరెత్తుతోంది.

WAR 2 Movie Official Teaser ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చింది వార్ 2 టీజ‌ర్‌తో అంచానాలెన్నో

WAR 2 Movie Official Teaser : ఎదురు చూస్తున్న క్ష‌ణం వ‌చ్చింది.. వార్ 2 టీజ‌ర్‌తో అంచానాలెన్నో

WAR 2 Movie Official Teaser  వార్ 2 టీజ‌ర్ అదిరింది..

‘వార్ 2’ టీజర్‌లో ట్రైన్ మీద ఎన్టీఆర్ దూకే సీన్ ఉంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అసలు బాలేదు అనేది ప్రధానంగా వినిపించే విమర్శ. అలాగే టీజర్‌లో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ట్రోల్ అవుతోంది. హృతిక్ పక్కన యానిమల్ వీఎఫ్ఎక్స్ సరిగా కుదరలేదని పోస్టులు చేస్తున్నారు. మంచు గుహలో హృతిక్ ఎన్టీఆర్ ఫైట్ మధ్యలో సీజీ వర్క్ కూడా ట్రోలింగ్‌కి గురయింది.

ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కిస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా అశుతోష్ రాణా, అనిల్ కపూర్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లుగా బాలీవుడ్ టాక్. వార్ 2కి ప్రీతమ్ స్వరాలు అందిస్తుండగా సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

YouTube video

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది