JR NTR : జూనియర్ ఎన్టీఆర్‌ మామూలోడు కాదు… సూపర్ పిల్లని పటాయించాడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : జూనియర్ ఎన్టీఆర్‌ మామూలోడు కాదు… సూపర్ పిల్లని పటాయించాడు…!

 Authored By ramesh | The Telugu News | Updated on :11 December 2022,6:30 pm

JR NTR : ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న కొరటాల శివ సినిమా పట్ల నందమూరి ఫ్యాన్స్ చాలా డిజప్పాయింటెడ్ గా ఉన్నారు. అలా ఎందుకు అంటే సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడమే దానికి కారణం అని అంటున్నారు. ఈ సినిమా ప్రతి విషయంలో జరుగుతున్న జాప్యం పై ఫ్యాన్స్ తీవర అసంతృప్తిగా ఉన్నారు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ సినిమాలో హీరోయిన్ పై కూడా ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరిగాయి. ఎన్.టి.ఆర్ 30వ సినిమా లో హీరోయిన్ గా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ సీరియల్స్ చేస్తూ సినిమాల్లో ఛాన్స్ అందుకున్న మృణాల్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో వరుస ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని టాక్. సీతారామం హిందీలో కూడా హిట్ అయ్యింది. అందుకే పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న తారక్ 30వ సినిమాకు ఆమె హీరోయిన్ గా అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. ఇంతకుముందు జాన్వి, పరిణీతి చోప్రా, దిశా పటాని ఇలా చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా ఫైనల్ గా ఈ మూవీలో

JR NTR with crazy bollywood heroine

JR NTR with crazy bollywood heroine

మృణాల్ అయితేనే పర్ఫెక్ట్ అని అనుకున్నారట. తారక్ కూడా సీతారామం చూసి మృణాల్ నటనకు ఫిదా అయ్యారట. అందుకే ఆమెనే ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు అర్ధమవుతుంది. మరి ఈ సినిమాలో సీతామహాలక్ష్మి ఫైనల్ అవుతుందా లేదా అన్నది చూడాలి. తారక్ సినిమా ఛాన్స్ నిజమే అయితే మాత్రం మృణాల్ ఫేట్ మారినట్టే లెక్క. ఎన్.టి.ఆర్ 30 పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. సినిమా జనవరి లో సెట్స్ మీదకు తీసుకెళ్లి దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది