JR NTR : చీకట్లో బయటకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
JR NTR : రాజకీయాలలోను, నటనలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారకరామారావు. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సాధారణ మనుషులే కాదు.. ఎందరిలో మార్గదర్శకులుగా నిలిచిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పరమాచార్య సైతం పరవశమయ్యారు. 1978లో ఎన్టీఆర్‌కు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదుని ప్రదానం చేశారు జగద్గురు. తెలుగు సినిమాకే మూల స్తంభంగా నిలిచిన నందమూరి నాయకుడి శత జయంతి నేడు ( మే 28).
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణం చిరస్మరణీయం.మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వారు ఉదయాన్నే అక్కడికి వెళ్లారు. ఇక మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ.. తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
JR NTR : ఎన్టీఆర్‌కి నివాళి..
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా చేయటం ఎన్టీఆర్‌కి మాత్రమే సాధ్యమైంది. రాముడు, కృష్ణుడే కాదు.. పరమేశ్వరుడిగానూ రౌద్రాన్ని వెండితెరపై సాక్షాత్కరింప చేయటం ఆయనకే చెల్లింది. ఇక అభిమాన ధనుడు సుయోధనుడిగా తారక రాముడు నటించిన తీరు ఇప్పటికీ మనం గుర్తు పెట్టుకున్నామంటే ఆయన ఆ పాత్రను పోషించిన విధానం మరెవ్వరికీ సాధ్యం కాలేదు.ఇక చారిత్రక పాత్రలను ఎన్టీఆర్ పోషించి తనదైన ట్రెండ్ క్రియేట్ చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు, చంద్ర గుప్తుడు, బ్రహ్మ నాయుడు, అక్బర్, వీర బ్రహ్మేంద్రస్వామి, అశోకుడు, శ్రీనాథుడు ఆయన నటన అసామాన్యం. ఆ పాత్రలను ఆయన తప్ప మరొకరు అంత గొప్పగా చేయలేరేమో అనేలా నటించటం ఆయన ప్రత్యేకత.