Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్, దేశముదురు లాంటి సినిమాలతో మరో లెవల్ కు చేరింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమాను విడుదల చేసేందుకు అభిమానులు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా రీ రిలీజ్ అయింది కాని దీనికి సరైన ప్లానింగ్, ప్రమోషన్స్ లేక అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈసారి గట్టి ప్లాన్ తో సింహాద్రి సినిమాను విడుదల చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రిని తారక్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. సింహాద్రి సినిమాను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా తెలుగు వాళ్ళు ఉన్న చాలాచోట్ల భారీగా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే సింహాద్రి సినిమా హావా మామూలుగా లేదు. విడుదలకు నెల రోజుల ముందే అక్కడ బుకింగ్స్ మొదలుపెట్టగా, అప్పుడే ప్రీ సేల్స్ ద్వారా 4 వేల డాలర్ల దాకా వసూళ్లు నమోదు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లలో సింహాద్రి సినిమా విడుదల కానుంది. మే 20 మేల్ బోర్న్ లోని భారీ ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాకి టాలీ మూవీస్ సంస్థ స్పెషల్ షో ప్లాన్ చేసింది. అంత పెద్ద స్క్రీన్ 20 ఏళ్ల కిందటి సినిమాకు కేటాయించడం విశేషం. ఆస్ట్రేలియాలోనే కాకుండా యూఎస్, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో సింహాద్రి స్పెషల్ షోలు భారీగానే పడనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా రిలీస్ ప్లాన్ గట్టిగానే ఉంది. ఏది ఏమైనా తారక్ బర్త్ డే రోజు హంగామా మామూలుగా ఉండదు అనిపిస్తుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.