Junior NTR : కర్ణాటక మొత్తం వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీడియో – కంట్లో నీళ్లు తిరగకపోతే అడగండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR : కర్ణాటక మొత్తం వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీడియో – కంట్లో నీళ్లు తిరగకపోతే అడగండి !

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2022,3:20 pm

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి సినిమాల వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు. సినిమాల పరంగా ఎన్టీఆర్ కి మామూలు క్రేజ్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత ను క్రియేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, నచ్చింది నచ్చినట్లు చేయడం ఎన్టీఆర్ లోని మరో స్పెషాలిటీ. ఇలా ఉండడం తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువే. అందుకే ఎన్టీఆర్ కి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగానే కాదు ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలను అతని తీరును ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు.

అయితే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఈ మధ్యనే తిరిగి వచ్చాడు ఆ తరువాత కన్నడ లో జరిగిన రజోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో అందరి చూపు ఎన్టీఆర్ పైనే పడింది. జూనియర్ ఎన్టీఆర్ కి సీఎం ప్రత్యేక ఆహ్వానం పంపించడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఈ రజ్యోత్సవ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. కర్ణాటకలో జరిగిన రజ్యోత్సవ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులతోపాటు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ ని సుధా మూర్తిని ఒకే వేదికపై చూసిన జనాలు ఓ రేంజ్ లో హల్చల్ చేశారు.

Junior NTR video is going viral all over Karnataka

Junior NTR video is going viral all over Karnataka

అయితే వేదికపై ఉన్న కుర్చీలో ఎన్టీఆర్ ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడ ఉన్న మరో మహిళతోపాటు సుధా మూర్తికి తానే స్వయంగా కుర్చీలను తుడిచి కూర్చోబెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతుంది. నిజంగా ఆస్థానంలో ఏ హీరో ఉన్న ఇలా చేసేవాళ్లు కాదు, తమ పని తాము చూసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఎన్టీఆర్ మహిళలకు, తన కన్నా వయసులో పెద్ద వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇస్తారో ఈ వీడియో ద్వారా మరోసారి రుజువయింది. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఎన్టీఆర్ అంటే అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది