Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచలన పోస్ట్..!
ప్రధానాంశాలు:
Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచలన పోస్ట్..!
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి 102వ జయంతి సందర్భంగా మే 28న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, కుమారుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి తమ అభిమానాన్ని తెలియజేశారు.

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచలన పోస్ట్..!
Jr NTR : గుండె తల్లడిల్లిపోతోంది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి ఎన్టీఆర్ తెలుగు సినిమా, రాజకీయ రంగాల్లో చేసిన కృషి అమోఘమని, ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరవలేనివని అన్నారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలు, ప్రజల కోసం చేసిన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, ఆదర్శవంతుడైన వ్యక్తి అని అభివర్ణించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తూ క్షణం నిశ్చలంగా నిలబడి తన తాతగారికి గౌరవం ప్రకటించారు.
జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా (X)లో భావోద్వేగ పోస్ట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఆయన పోస్ట్ చేసిన సందేశం అభిమానుల హృదయాలను కదిలించింది. దీనిపై “జోహార్ ఎన్టీఆర్” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు “జోహార్ ఎన్టీఆర్” అంటూ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నివాళుల వర్షం కురిపిస్తున్నారు.