Trivikram Jr Ntr : అల్లు అర్జున్ కథ ఎన్టీఆర్ దగ్గరికి.. కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్..!
ప్రధానాంశాలు:
Trivikram Jr Ntr : అల్లు అర్జున్ కథ ఎన్టీఆర్ దగ్గరికి.. కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్..!
Trivikram Jr Ntr : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్.. అల్లు అర్జున్, వెంకటేష్‌తో సినిమాలు చేస్తారని టాక్ వినిపిస్తున్నా ప్రకటన మాత్రం లేదు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తుండటంతో ఇక సుదీర్ఘ నిరీక్షణ ఇష్టం లేక త్రివిక్రమ్..ఎన్టీఆర్ వైపు మళ్లారని ఇన్‌సైడ్ టాక్.

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ కథ ఎన్టీఆర్ దగ్గరికి.. కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్..!
Trivikram Jr Ntr ఇది నిజమా ?
గతంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. మరోసారి వారిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం, అందునా పౌరాణికాలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ అనే పేరు ఉండటంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్‌లు ఈ వార్తను ధృవీకరించేలా ఉన్నాయి. ‘నేను అభిమానించే అన్న.. అత్యంత ఇష్టమైన దేవుడి పాత్రలో..’ ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’ అంటూ నాగవంశీ పోస్ట్‌లు పెట్టారు. వీటితో పాటు కార్తికేయుడి తాలూకు సంస్కృత శ్లోకాలను రాసుకొచ్చారు.
ఎన్టీఆర్‌ను ఉద్దేశించే ‘ఫేవరేట్ అన్న..’ అని ఆయన పోస్ట్ చేశారని టాక్. ఇక ఈ సినిమా కథ గురించి గతంలోనే వార్తలొచ్చాయి. హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తికేయుడి కథ ఇదని సమాచారం. పురాణాలకు, నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారంటున్నారు. క్లారిటీ రావలసి ఉంది..