Nagarjuna : నాగార్జున అలాంటి వాడే.. సంచలన కామెంట్స్ చేసిన కాదంబరి కిరణ్..!
Nagarjuna : తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి.మెగా ఫ్యామిలీ తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ ఫ్యామిలీ అంటే అక్కినేని ఫ్యామిలీ అంటుంటారు. ప్రస్తుతం చిరు, నాగ్ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీని తమ భుజాలపై మోస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.పరిశ్రమలకు ఏ కష్టం వచ్చినా వీరు ఇద్దరూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యి పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.చిరుకు తమ్ముడిగా నాగార్జున మెదులుతుంటాడు. ఈ రెండు ఫ్యామిలీలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటాయి.
ఇక కింగ్ నాగార్జున తనయులు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ కూడా స్టిల్ సినిమాలు చేస్తూ కొడుకులకు గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే, నాగార్జునపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు.తన సినిమా స్టోరీ వినేందుకు ఏకంగా నాగార్జున 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అది ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు.ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Nagarjuna : 17 ఏళ్లు గడిచినా..
నాగార్జున గారికి కుర్రాళ్ళ రాజ్యం అనే సినిమా తర్వాత ఒక కథ చెప్పాలని ఆయన ఇంటికి వెళ్ళాను.నేను చెప్పే కథ వినడానికి నాగార్జున ఏకంగా రెండున్నర గంటలు కూర్చున్నారంటే అది ఒక అద్భుతం.కానీ నేను చెప్పిన కథకు నాగార్జున 2 సీన్లను కరెక్షన్ చేయమని తెలిపారు.కానీ 17 ఏళ్లు గడిచినా ఆ రెండు సీన్ల కరెక్షన్ మాత్రం ఇప్పటికీ ఆయన వినడం లేదు.కానీ అది ఆయన తప్పు కాదన్నారు. నాగార్జునతో తెరకెక్కించాల్సిన బావ మూవీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందని ఆ ఇంటర్వ్యూలో అడిగితే.. ఎందుకంటే నాగార్జున క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది కదా అని కాదంబరి కిరణ్ అన్నారు.
నాగార్జునకు పల్లెటూరి టైటిల్స్ అంటే చాలా ఇష్టమని, ఇండస్ట్రీలో ఆయన్ను చినబాబు అని అందరూ పిలుస్తారని వెల్లడించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదాన్ని కనిపెట్టింది తానేనని కాదంబరి కిరణ్ చెప్పారు.నా డైలాగ్‌ను పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మూవీలో పెట్టుకున్నారు.ఇక ఆ తర్వాత ప్రభాస్‌కు అది ఊతపదం గా మారిపోయిందని వివరించే ప్రయత్నంచేశారు.