Kaikala Satyanarayana : సినిమా పరిశ్రమలో మరో విషాదం.. సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Kaikala Satyanarayana : గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో లెజెండ్స్‌గా చెప్పుకునే నటీనటులు, దర్శక నిర్మాతలు అనారోగ్యంతో కన్నుమూస్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు తెల్లవారుఝామున నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ, Kaikala Satyanarayana మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ,Satyanarayana ,నటించిన కైకాల 1935లో జన్మించారు. సత్యనారాయణ స్వస్థలం
Krishna District, Kautavaram Mandal, Gudlavalleru, కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు కాగా.. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు, ఒక భార్య ఉన్నారు.రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేసిన కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైనే నటించిన ఆయన యుముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భక్తప్రహ్లాద` విడుదల కాగా, ఆ నాలుగేండ్లకే 1935 జులై 25న కైకాల జన్మించారు.
తెలుగు సినిమాతోపాటు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కళామతల్లి ఒడిలోనే ఆరు దశాబ్దాలు బతికిన కైకాల 25ఏళ్ల వయసులో 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నాడు. కెరీర్ తొలిదశలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించడం అధష్టం. `లవకుశ`లో భరతుడిగా, `శ్రీకృష్ణార్జున యుద్ధం`లో కర్ణుడిగా, `నర్తనశాల`లో దుశ్శాసనుడిగా నటించి మెప్పించారు. `శ్రీ కృష్ణపాండవీయం`లో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన `ఘటోత్కచుడు` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి ఏ పాత్రకు అయిన న్యాయం చేయగల సత్తా తనకు ఉందని నిరూపించాడు కైకాల. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు కాగా, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.