Kaikala Satyanarayana : నిన్న సాయంత్రం వరకూ కూడా డబ్బు సంపాదించాడు…. కైకాల సత్యనారాయణ మొత్తం ఆస్తుల లెక్క ఇదే…!
Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఈరోజు ఉదయం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆవేదనకు గురైంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సహా నటీనటులంతా కైకాల తో ఉన్న అనుబంధాన్ని నెమరువేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. కైకాల పోషించని పాత్ర లేదు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచాడు. ఈయన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు.
గుడివాడ విజయవాడ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, గుడివాడలోనే డిగ్రీ కూడా పూర్తి చేశారు.1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చదువుకునే రోజుల్లో కైకాల సినిమాలపై ఆసక్తి ఉండడంతో మద్రాసు వెళ్లారు. నవరస నటసార్వభౌముడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. యముడు, దుర్యోధనుడు, రావణుడు లాంటి పాత్రలకు ఆయనకు పెట్టింది పేరు. ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. అయితే కైకాల పెద్దగా ఆస్తులను కూడబెట్టుకోలేదు. వందల సినిమాల్లో నటించినప్పటికీ ఆయన అంతగా సంపాదించలేదు.
గతేడాది అనారోగ్యంతో హాస్పటల్లో చేరగా ఏపీ సీఎం ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం తరఫున హాస్పిటల్ ఖర్చులను చెల్లించారు.కైకాలకు రెండు కార్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు ఒకటి. మరొకటి 67 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కారు. ఈ రెండు కార్ల విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. గచ్చిబౌలి లో గల నాగార్జున రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు కైకాల సత్యనారాయణ. ఈ ఇంటి విలువ రూ. 1.5 కోట్లు ఉండొచ్చు అని అంటున్నారు. బెంగళూరులో కూడా ఓ ఇల్లు ఉందని సమాచారం. ఇంతకు మించి కైకాలకు పెద్దగా ఆస్తులు లేవని తెలుస్తుంది.