Kaikala Satyanarayana : నందమూరి ఫ్యాన్స్ కి కైకాల సత్యనారాయణ అంటే కుళ్లు , జెలసీ .. కారణం ఇదే….!
Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ కు పోటీగా నటిస్తూ పెద్ద పెద్ద డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పేవాడు. అయితే కైకాల ఎన్టీఆర్ కు డూప్ గా చాలా సినిమాలలో నటించారు. కైకాల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నువ్వు ఎన్టీఆర్ లా ఉన్నావు అనేవారట. వెనుక నుంచి చూస్తే అచ్చం ఎన్టీఆర్ లా ఉన్నావు అనేవారట. ఇది గ్రహించిన ఎన్టీఆర్ కైకాలను సినిమాలో ప్రోత్సహించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ కు డూప్ గా కైకాల నటించారు. అంతే కాదు తన సినిమాల్లో కైకాలకు అవకాశాలు ఇస్తూ ఆయన కెరీర్లో ఎదగటానికి ఎన్టీఆర్ సాయపడ్డారట.
ఇక దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో కైకాలను తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. సినీ ఇండస్ట్రీకి కైకాల 1959లో ఎంట్రీ ఇచ్చాడు. తన ఫస్ట్ మూవీ సిపాయి. ఈ సినిమా అంతగా ఆడలేదు. అయినా కైకాలపు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమకుటం సినిమాలో చిన్న పాత్రలో నటించారు కైకాల. ఆయన ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ తన ప్రతి సినిమాలోని అతనికి అవకాశాలు ఇచ్చారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు. ఎన్టీఆర్ తో కలిసి 100కు పైగా సినిమాలు సినిమాల్లో నటించారు. వీటిలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు చేశారు.
ఎన్టీఆర్ నటించిన ‘ యమగోల ‘ సినిమాలో యముడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ యమగోల ‘ సినిమా తర్వాత యముడు అంటే కైకాల సత్యనారాయణ నే అనేంతలా పేరు తెచ్చి పెట్టింది. ఇప్పటివరకు కైకాల 777 సినిమాలలో నటించారు. ఈయన చివరిగా నటించిన సినిమా దీర్ఘాయుష్మాన్ భవ . ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. జనవరిలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇక కైకాల వయసు 87 సంవత్సరాలు. కత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల డిసెంబర్ 23 తెల్లవారుజామున 4 గంటలకు మరణించారు.