Nisha Agarwal : భర్తతో నిషా అగర్వాల్ ముద్దులాట!.. పర్సనల్ ఫోటోను షేర్ చేసిన కాజల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nisha Agarwal : భర్తతో నిషా అగర్వాల్ ముద్దులాట!.. పర్సనల్ ఫోటోను షేర్ చేసిన కాజల్

 Authored By prabhas | The Telugu News | Updated on :28 December 2021,5:40 pm

Nisha Agarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈమె చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆమె కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది.

కానీ కాజల్ అగర్వాల్ అందుకున్నంత గుర్తింపును అందుకోలేకపోయింది. ఈమె తొలిసారిగా ఏమైంది ఈ వేళ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సోలో, ఇష్టం, సుకుమారుడు వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. నిషా అగర్వాల్ తన పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.

Kajal Agarwal shares Nisha Agarwal personal photo

Kajal Agarwal shares Nisha Agarwal personal photo

2013లో డిసెంబర్ లో నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. నిషా తన భర్తతో బాగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా నిషా తన భర్తతో ముద్దు పెట్టుకుంటూ ఫోటో దిగగా ఆ ఫోటోను కాజల్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాకుండా వారి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది