Kajal Aggarwal : 40 ఏళ్ల వయస్సులోను ఏ మాత్రం తగ్గని కాజల్ అందం.. కాక రేపుతుందిగా.. వీడియో!
ప్రధానాంశాలు:
Kajal Aggarwal : 40 ఏళ్ల వయస్సులోను ఏ మాత్రం తగ్గని కాజల్ అందం.. కాక రేపుతుందిగా.. వీడియో!
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కాక రేపుతుంది. తాజాగా సికందర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న కాజల్ కేక పెట్టించే విధంగా కనిపించింది.

Kajal Aggarwal : 40 ఏళ్ల వయస్సులోను ఏ మాత్రం తగ్గని కాజల్ అందం.. కాక రేపుతుందిగా.. వీడియో!
Kajal Aggarwal ఏమందం ఇది..
అసలు కాజల్‌ని ఇలా చూసి ఎవరైన పిచ్చెక్కిపోవల్సిందే. ఏమందం ఇది 40 ఏళ్లు దాటిన కూడా అందం చెక్కు చెదరలేదు కదా అని కామెంట్ చేస్తున్నారు. ఇక కాజల్ 2004లో అమితాబ్ బచ్చన్ నటించిన క్యూ హో గయానా అనే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ – తేజ కాంబోలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కలువ కళ్లతో లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకున్నారు కాజల్. ఆ తర్వాత పౌరుడు, ఆటాడిస్తా సినిమాలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ కావడంతో కాజల్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు కాజల్ అగర్వాల్.
Kajal Aggarwal : Mommy Shakes 🏀🥵 pic.twitter.com/bVAGXxzjZq
— Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ (@RaashiSena) March 23, 2025