Kajal Aggarwal : బేబి బంప్‌తోను వ‌ర్క‌వుట్స్ చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్… ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్స్ వీడియో..!

Authored By Sam C | The Telugu News | Published on: February 28, 2022, 5:30 pm

Kajal Aggarwal: అందాల ముద్దుగుమ్మ‌లు ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే పెళ్లిళ్లు చేసుకోవ‌డం, పిల్ల‌ల్ని క‌న‌డం వంటివి చేస్తున్నారు. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అనే సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ బాగానే కష్టపడుతోంది. బిడ్డ ఆరోగ్యంగా, సురక్షితంగా పుట్టాలని కాజల్ బాగానే వర్కవుట్లు చేస్తోంది. తాజాగా కాజల్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కాజల్ చేసిన వర్కవుట్లు వైరల్ అవుతున్నాయి.

‘నేను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యక్తినే. నా జీవితంలో ఎక్కువగా వర్కవుట్లు చేస్తూనే ఉంటాను. కానీ గర్భం దాల్చడం అనేది కొత్త అనుభవం. ఎటువంటి సమస్యలు లేకుండా గర్భస్రావం కావడంతో కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటివి చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంత ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో సాయపడింది’ అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్లను కాజల్ షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు స్ట‌న్ అవుతున్నారు.

kajal aggarwal work out video

kajal aggarwal work out video

Kajal Aggarwal : కాజ‌ల్ వ‌ర్క‌వుట్స్..

కాజ‌ల్ త‌ల్లి అవుతున్న క్ర‌మంలో ఆమె ఫ్యామిలీ మొత్తం తెగ సంతోషంగా ఉంది. ఇటీవ‌ల కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది. “అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఇక్కడే ఈ గర్భంలో నేను తాకుతున్నాను. నా బిడ్డ నం 2 దారిలో ఉంది! నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్న లిటిల్ లవ్… కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను! మీరు కొత్త పాత్రలను పోషించి, ఈ అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందున మీ ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ నిషా షేర్ చేసిన పిక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp