Kajal Aggarwal : చెమ‌ట‌లు కారుస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఏకంగా మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా..

Authored By Sam C | The Telugu News | Published on: September 26, 2022, 1:00 pm

Kajal Aggarwal: క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజల్ అగ‌ర్వాల్ మ‌ళ్లీ రీఎంట్రీకి సిద్ధ‌మైంది.రీసెంట్‌గానే బిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటీ ఇప్పుడు లోక‌నాయ‌కుడుకమల్‌హాసన్ పక్కన క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్‌-2 సినిమాలో కీలక పాత్రలో న‌టిస్తుంది. ఇండియ‌న్ 2 అనేక అవాంత‌రాల‌ను దాటుకొని మ‌ళ్లీ తిరిగి షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా కోసం కాజ‌ల్ చాలానే క‌ష్ట‌ప‌డుతుంది. కేరళ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తోంది. గుర్ర‌పు స్వారీలు నేర్చుకుంటుంది. జిమ్ లో కూడా ప‌లు క‌స‌ర‌త్తులు చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంది.

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో దశాబ్దానికి పైగా హీరోయిన్‌గా మెప్పించిన అమ్మ‌డు కాజ‌ల్ అగ‌ర్వాల్ … గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న త‌ర్వాత కొన్ని నెల‌లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది. బాబు కూడా పుట్టిన త‌ర్వాత పూర్తి స‌మ‌యాన్ని కుటుంబానికి స‌మ‌యాన్ని కేటాయించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు ప్రొఫెష‌న్‌గా బిజీగా మార‌డానికి స‌మాయ‌త్త‌మైంది. అందులో భాగంగా ఆమె ఫిట్‌నెస్‌ను తిరిగి తెచ్చుకునే ప‌నిలో బిజీగా ఉంది. అందులో భాగంగా గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేయగా, దానికి సంబంధించిన వీడియోని ఇటీవ‌ల షేర్ చేసింది.

Kajal Aggarwal workout video viral

Kajal Aggarwal workout video viral

Kajal Aggarwal : కాజ‌ల్ క‌ష్టాలు..

ఈ సినిమా ప్రారంభంలో ఈ పాత్ర కోసం ఆమె చాలానే క‌ష్ట‌ప‌డింది. మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. అయితే ఆమె షూటింగ్ చేయాల్సిన షెడ్యూల్ స‌మ‌యానికి క‌రోనా రావ‌టం.. క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. అలాగే శంక‌ర్‌కి, నిర్మాత‌ల‌తో పొస‌గ‌క పోవ‌టంతో ఇండియ‌న్ 2 ఆగిపోయింది. చాలా గ్యాప్ త‌ర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ గ్యాప్‌లో కాజ‌ల్ పెళ్లి చేసుకుని పిల్లాడిని కూడా క‌నేసింది. ఏదైతేనేం.. సినిమా నుండి త‌ప్పుకోకుండా త‌న‌కు క‌లిసి వ‌చ్చింది. ఈ సినిమాతో కాజ‌ల్ మ‌ళ్లీ త‌న పాత ఫాంని చూపిస్తూ దూసుకుపోనుంద‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  2. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  3. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  4. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  5. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  6. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

  7. "OM Movie Review : ధనుష్, మమ్ముట్టి ఓం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp