
Kalki 2898 AD Movie Review : ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
kalki 2898 AD Movie : గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామా లేకపోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కల్కి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించగా, ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. టైం ట్రావెల్ కథతో రూపొందిన ఈ చిత్రాన్ని పలు యుగాల కాలలకు వెళ్లి డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
చిత్రంలో ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న యువకుడిగా కనిపించబోతున్నాడు. అతనికి బుజ్జి అనే వాహనం కూడా ఉంటుంది. ఇక ఇటీవల మూవీకి సంబంధించిన పలు వీడియోలు విడుదల కాగా, అవి చూసినప్పటి నుండి చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రాండ్ రిలీజ్.. ప్రమోషన్ విజువల్ వండర్‌గా రాబోతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని జూన్ 27న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయినప్పటికీ ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. ప్రభాస్ క్రేజ్, మూవీ టీజర్, ట్రైలర్స్ చూసిన అభిమానులు సినిమాని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది.
kalki 2898 AD Movie : కల్కి బిజినెస్ అన్ని వందల కోట్లా.. లాభం రావాలంటే ఎంత రాబట్టాలి అంటే..!
ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 70 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 83 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి రూ. 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి..కర్నాటకలో రూ. 28 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 385 కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు రూ. 385 కోట్లు బిజినెస్ జరగగా, రూ. 388 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.