Sreeja Kalyan Dhev : హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ్డ శ్రీజ భ‌ర్త‌.. విడాకుల‌కి కార‌ణం అదేనా?

Authored By Sam C | The Telugu News | Published on: February 8, 2022, 1:40 pm

Sreeja Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల వ్య‌వ‌హారం గ‌త కొద్ది రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. 2007లో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ను ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రీజ. అప్ప‌ట్లో ఈమె పెళ్లి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరికి ఒక పాప పుట్టింది. పెళ్లైన కొన్నేళ్ల‌కు అంటే 2014లో విడాకులు తీసుకోవ‌డం ద్వారా శ్రీజ, శిరీష్ భ‌రద్వాజ్ విడిపోయారు. త‌ర్వాత 2016లో క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీజ వివాహం జ‌రిగింది. వీరికి ఓ పాప పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా సూప‌ర్ మ‌చ్చి అనే సినిమాతోను ప‌ల‌క‌రించాడు.

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మ‌రోసారి విడాకులు తీసుకోబోతున్నార‌నే విష‌యం కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్నారు. శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటోల‌తో పాటు కొన్ని ఫ్యామిలీ వీడియోలు, ఫొటోల‌ను షేర్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఏమైందో ఏమో కానీ.. కొన్ని నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం.

Sreeja Kalyan Dhev fall in love with heroine

Sreeja Kalyan Dhev fall in love with heroine

Sreeja Kalyan Dhev : ప్రేమ‌లో ప‌డ్డాడా…

శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తుండ‌గా, స‌డెన్‌గా ఈ ఇద్ద‌రు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అనే విష‌యంపై నెటిజ‌న్స్ ఆరా తీస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని, అందుకే శ్రీజ తనతో కలిసి ఉండలేక తన నుంచి విడాకులను కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు. ఇలా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విడాకుల వార్తలు చక్కర్లు కొడుతునప్పటికీ మెగా కుటుంబం ఏమాత్రం స్పందించలేదు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp