Kalyan Dev- Sreeja : శ్రీజ గురించి కళ్యాణ్ దేవ్ ఏం పోస్ట్ చేసాడో చూసి షాక్ అయిన చిరంజీవి?
Kalyan Dev- Sreeja : మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తెలుసు కదా. తనకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. విడాకులు అయ్యాయి. దీంతో ప్రస్తుతం తనకు మూడో సంబంధం చూసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నట్టు తెలుస్తోంది. తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇచ్చాక ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయ్యారు. కళ్యాణ్ దేవ్ సినిమాలను ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం లేదు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తున్నా.. వాళ్ల విడాకులకు సరైన కారణం మాత్రం తెలియలేదు.
వీళ్లకు ఒక బిడ్డ జన్మించింది. తన పేరు నవిష్క. తను ప్రస్తుతం శ్రీజ దగ్గరే ఉంటోంది. దీంతో అప్పుడప్పుడు తన కూతురును చూడాలనిపిస్తే తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు కళ్యాణ్ దేవ్. కూతురిని తలుచుకొని కళ్యాణ్ దేవ్ తాజాగా చాలా బాధపడ్డాడు. చాలాసార్లు కూతురు గురించి సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ పోస్టులు పెట్టేవాడు. తాజాగా హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు కళ్యాణ్ దేవ్ శుభాకాంక్షలు తెలిపాడు.
Kalyan Dev- Sreeja : సోషల్ మీడియాలో వాలంటైన్స్ డే నాడు గొడవ పడ్డ శ్రీజ, కళ్యాణ్
అయితే.. వాలంటైన్స్ డే నాడు కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ సోషల్ మీడియాలో గొడవకు దిగారు. ఒకరిని మరొకరం ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు.. వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేదే ముఖ్యం అంటూ కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. ఒకరిని ప్రేమించడం అంటే అర్థం.. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం అంటూ శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ పోస్ట్ కు కౌంటర్ పోస్ట్ పెట్టింది. వాళ్ల ట్వీట్ల వార్ ను చూసి వామ్మో.. వీళ్ల మధ్య ఇంత దూరం పెరిగిందా? అని అభిమానులు అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా.. చిరంజీవి చిన్నకూతురు శ్రీజ జీవితం ఇలా అవడంపై చిరంజీవి కూడా చాలా బాధపడుతున్నారట.