Sreeja konidela : శ్రీజ ఫ్రెండ్ నే రెండో పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ దేవ్ .. షాక్ లో మెగా ఫ్యామిలీ..!!
Sreeja konidela : మెగా డాటర్ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే శ్రీజ పెళ్లి కళ్యాణ్ దేవ్ తో ఎంత ఘనంగా జరిగిందో. శ్రీజ కి ఇది రెండో పెళ్లి అయినా సరే కళ్యాణ్ దేవ్ అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో వీళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తద్వారా వీళ్ళు విడాకులు తీసుకున్నారు. వీళ్ళ విడాకుల విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ వీళ్లు మాత్రం దూరంగానే ఉంటున్నారు.
ఇలాంటి క్రమంలోనే పలుమార్లు సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ శ్రీజలు పెట్టే పోస్టులు వాళ్ళ విడాకులకు కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకోబోయేది శ్రీజ ఫ్రెండ్ ని అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దీంతో మెగా మాజీ అల్లుడు దెబ్బ అదిరిపోయింది అంటూ మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం లేని వాళ్ళు కళ్యాణ్ దేవ్ ని సపోర్ట్ చేస్తున్నారు.
అయితే మరి కొంతమంది శ్రీజ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతు కావాలనే శ్రీజ కు విడాకులు ఇచ్చాడా, ఆమెతో ఎఫైర్ నడిపాడా అన్న విధంగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి మ్యాటర్ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఆడపిల్లల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీజ , నిహారికలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికే. వీళ్ళ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.