Samantha : సమంతపై కళ్యాణ్ దేవ్ కామెంట్లు.. అలా అనేశాడుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంతపై కళ్యాణ్ దేవ్ కామెంట్లు.. అలా అనేశాడుగా

 Authored By prabhas | The Telugu News | Updated on :18 March 2022,11:00 am

Samantha : సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయింది. సినిమాలు, ప్రకటనలు, వ్యాపారాలు అంటూ తిరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా మరో ప్రకటనలో నటించింది. మొన్నటికి మొన్న ఓ మద్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఆల్కహాల్ తాగమంటూ ప్రోత్సహించింది. ఇక ఇప్పుడు కూల్ డ్రింక్ బ్రాండ్‌కు సంబంధించిన ప్రకటనల్లో నటించింది. శీతల పానియంకు సంబంధించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సమంత తాజాగా ఫాంటాకు సంబంధించిన యాడ్‌లో నటించింది. ఈ యాడ్ కాస్త వింతగా, కొత్తగా, ఆసక్తికరంగా సాగింది. స్టేడియంలో అందరూ ఆటను తిలకిస్తుంటారు. అంతా ఎంతో కాన్సన్‌ట్రేషన్‌తో ఆటను చూస్తుంటారు. ఇక సమంత మాత్రం బోర్ కొట్టి ఫాంటాను ఓపెన్ చేస్తుంటుంది. సిప్ చేస్తున్న కొద్దీ ఆపిల్ ముక్కలను కొరికినట్టుగా స్టేడియం అంతా కూడా శబ్దాలు వినిపిస్తాయి. దీంతో కెమెరాలన్నీ సమంత మీదే ఫోకస్ పెట్టేస్తుంటాయి.

Kalyaan Dhev On Samantha Fanta Ad

Kalyaan Dhev On Samantha Fanta Ad

Samantha : నవ్వేసిన కళ్యాణ్ దేవ్..

అలా మొత్తానికి ఈ యాడ్‌లో సమంత దుమ్ములేపేసింది. ఈ యాడ్ మీద నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ ఈ యాడ్ మీద స్పందించింది. హహ అని నవ్వేశాడు. సూపర్ క్యూట్ అంటూ సమంత మీద ప్రశంసలు కురిపించేశాడు. మొత్తానికి కళ్యాణ్ దేవ్ అయితే ఈ మధ్య ఎక్కువగా నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడిపోయాడంటూ వస్తోన్న రూమర్లపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది