
Kamal Haasan to marry Sridevi
Kamal Haasan : భారతీయ సినీ ప్రియులకి పరిచయం చేయనక్కర్లేని పేరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించింది శ్రీదేవి. తెలుగు, తమిళ వంటి సినిమాల్లోనే కాదు హిందీ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీ దేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి. ఆమె కళ్లతో చిలిపిగా ఓ నవ్వు నవ్వితే ప్రేక్షకులు మైమరచిపోతారు..పూల రెక్కలు, కొన్నితేనె చుక్కలు కలిపి చేసిన భూలోక సౌందర్యం శ్రీదేవి అనిపిస్తుంది. మూడు తరాల హీరోల సరసన హీరోయిన్ గా అలరించిన అందం శ్రీదేవి సొంతం.
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు. సీనియర్ ఎన్టీఆర్ తో సహా స్టార్ హీరోలందరితోనూ నటించారు. తమిళ చిత్రాల్లో కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి.. ఆ తర్వాత సౌతిండియాతో పాటు అనేక భారతీయ భాషల్లో నటించి మెప్పించింది. . ఆమె అందం చూస్తే రాళ్లు కూడా రాగాల గువ్వలవుతాయి. ఆ పరువాల పలుకులకు చిలుకలు కూడా ఆమె పాదాల చుట్టూ తిరుగుతాయి. వేటగాడు, బొబ్బులి పులి, క్షణ క్షణం, ప్రేమాభిషేకం, కంచుకాగడ, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందింది. శ్రీదేవి బోనీ కపూర్‌ని చేసుకొని జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు కృషి చేస్తున్నారు.
Kamal Haasan to marry Sridevi
అయితే శ్రీదేవి.. అసలు కమల్ హాసన్‌ని వివాహమాడాల్సిందట. . ‘ఆకలి రాజ్యం’ ‘వసంత కోకిల’ ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో రూపొంది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.శ్రీదేవి కూడా తమిళ్ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అనుభవించేవారు. ఈ కారణాలతోనే అనుకుంట.. ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్ళి చేసుకోమని ఆమె తల్లి కమల్ హాసన్ ను అడిగారట. కానీ ఈ పెళ్ళి ప్రపోజల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించారట. అందుకు ప్రధాన కారణం.. శ్రీదేవిని కమల్ సోదరిగా భావించేవారట. సినిమాలో వారి మధ్య లవ్ సీన్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం శ్రీదేవిని ఆ భావంతో చూడలేదని ఆయన చెప్పారట. అలా కమల్ ని మిస్ చేసుకునే ఛాన్స్ శ్రీదేవి మిస్ చేసుకుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.