Kamal Haasan : శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సిన క‌మ‌ల్ హాస‌న్.. ఎక్క‌డ తేడా కొట్టిందో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: November 3, 2022, 1:00 pm

Kamal Haasan : భార‌తీయ సినీ ప్రియుల‌కి ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించింది శ్రీదేవి. తెలుగు, తమిళ వంటి సినిమాల్లోనే కాదు హిందీ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీ దేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి. ఆమె కళ్లతో చిలిపిగా ఓ నవ్వు నవ్వితే ప్రేక్షకులు మైమరచిపోతారు..పూల రెక్కలు, కొన్నితేనె చుక్కలు కలిపి చేసిన భూలోక సౌందర్యం శ్రీదేవి అనిపిస్తుంది. మూడు తరాల హీరోల సరసన హీరోయిన్ గా అలరించిన అందం శ్రీదేవి సొంతం.

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు. సీనియర్ ఎన్టీఆర్ తో సహా స్టార్ హీరోలందరితోనూ నటించారు. తమిళ చిత్రాల్లో కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి.. ఆ తర్వాత సౌతిండియాతో పాటు అనేక భారతీయ భాషల్లో నటించి మెప్పించింది. . ఆమె అందం చూస్తే రాళ్లు కూడా రాగాల గువ్వలవుతాయి. ఆ పరువాల పలుకులకు చిలుకలు కూడా ఆమె పాదాల చుట్టూ తిరుగుతాయి. వేటగాడు, బొబ్బులి పులి, క్షణ క్షణం, ప్రేమాభిషేకం, కంచుకాగడ, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. శ్రీదేవి బోనీ క‌పూర్‌ని చేసుకొని జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్‌కి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. వారు ప్ర‌స్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాటేందుకు కృషి చేస్తున్నారు.

Kamal Haasan to marry Sridevi

Kamal Haasan to marry Sridevi

Kamal Haasan : అది కార‌ణ‌మా?

అయితే శ్రీదేవి.. అస‌లు క‌మ‌ల్ హాస‌న్‌ని వివాహ‌మాడాల్సింద‌ట‌. . ‘ఆకలి రాజ్యం’ ‘వసంత కోకిల’ ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో రూపొంది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.శ్రీదేవి కూడా తమిళ్ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అనుభవించేవారు. ఈ కారణాలతోనే అనుకుంట.. ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్ళి చేసుకోమని ఆమె తల్లి కమల్ హాసన్ ను అడిగారట. కానీ ఈ పెళ్ళి ప్రపోజల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించారట. అందుకు ప్రధాన కారణం.. శ్రీదేవిని కమల్ సోదరిగా భావించేవారట. సినిమాలో వారి మధ్య లవ్ సీన్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం శ్రీదేవిని ఆ భావంతో చూడలేదని ఆయ‌న చెప్పార‌ట‌. అలా క‌మ‌ల్ ని మిస్ చేసుకునే ఛాన్స్ శ్రీదేవి మిస్ చేసుకుంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp