
RRR Movie sequel plans again
RRR Movie : ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న విడుదలయ్యేందుకు సిద్దమైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్స్‌లో సినిమా విడుదల కానుంది. కర్నాటకలో మాత్రం సినిమాని వ్యతిరేకిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`ని చూడబోం అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హాజరయ్యారు.శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కన్నడ భాషలో ఈ సినిమాని విడుదల చేయాలని కోరారు.
కానీ ఆయన మాటని పట్టించుకోకుండా సినిమాని కన్నడ భాషలో విడుదల చేయడం లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాట మీద నిలబడలేదని వారు కామెంట్ చేస్తున్నారు. రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే `#BoycottRRRinKarnataka` యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు పునీత్ రాజ్‌కుమార్ సినిమాకి అన్యాయం చేస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం `జేమ్స్` గత వారం విడుదలైంది. ప్రస్తుతం ఇది థియేటర్‌లో రన్ అవుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` కోసం రెండు మూడు థియేటర్లు తప్ప మిగిలిన అన్ని చోట్ల తీసేస్తున్నారు. దీంతో పునీత్ అభిమానులు మండిపడుతున్నారు. `జేమ్స్`ని కదిపేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
kannada fans fire on rrr Movie makers
ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రూపొందిన సినిమా `ఆర్‌ఆర్‌ఆర్`. పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు రాజమౌళి రూపొందించారు. ఈ సినిమా కోసం కోట్లాది మంది ఆడియెన్స్ ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ విజువల్ వండర్‌ని థియేటర్‌లో తిలకించేందుకు వెయిట్ చేస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళం, హిందీ వెర్షన్‌లోనే విడుదల చేస్తున్నారట. బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లోకి వెళితే అందులో కన్నడ లాంగ్వేజ్ లేకపోవడంతో అ అభిమానులు ఖంగుతింటున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా అంటే మాకు ఇష్టమని, కానీ కన్నడ భాషలోనే ఆ సినిమాని చూడాలనుకుంటున్నామని వారు చెబుతున్నారు. కన్నడ డబ్ వెర్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ విడుదల చేస్తున్న కేవీపీ డిస్ట్రిబ్యూషన్ సంస్థని ట్రోల్స్ చేస్తున్నారు. .
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.