Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2025,1:04 pm

ప్రధానాంశాలు:

  •  Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..!

Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో యావరేజ్ అనిపించినా, సెకండ్ హాఫ్ బాగుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా నడిచింద‌ని, భావోద్వేగాలు బాగానే ఉన్నా ఏదో లోపించిన‌ట్టు ఉందని అంటున్నారు.

Kannappa Movie కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి సినిమా హిట్టా ఫ‌ట్టా వీడియో

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

Kannappa Movie : మిక్స్‌డ్ టాక్..

ఇంటర్వెల్ తర్వాత సినిమా ఊపందుకుంటుందని టాక్. కథలో మేజర్ ట్విస్ట్‌లు, విజువల్ గ్రాండియర్ ఆకట్టుకున్నాయి. కథనం ఆసక్తికరంగా మారింది అని మెచ్చుకుంటున్నారు. చివరి 20 నిమిషాల్లో సినిమా “వేరే లెవెల్”లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు. విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ అన్ని బాగున్నాయంటున్నారు.

కథలో ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్‌కి థియేటర్లలో జనాలు చప్పట్లు, అరుపులతో హోరెత్తించారు. “ప్రభాస్ అన్నని చూసినందుకు సంతోషంగా ఉంది” అనే మాటలు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి.మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత భారీ కంటెంట్ లేదనే ఫీల్ ఉన్నా, విజువల్స్‌, మ్యూజిక్‌, ఎమోషనల్ కానెక్ట్‌తో సినిమా ఆదరణ పొందుతోందని జనాభిప్రాయం. క్లైమాక్స్ మరియు ప్రభాస్ హంగామా సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పొచ్చు.

YouTube video

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది