Kannappa Movie Review : కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Kannappa Movie Review : కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు Mohan Babu నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు Vishnu Manchu కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

Kannappa Movie Review : కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Kannappa Movie Review : క్రేజీ కామెంట్స్
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. పాత సినిమాలను తప్పితే, మంచు విష్ణు యాక్ట్ చేసిన కొత్త సినిమాలను టీవీల్లో సైతం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని టాలీవుడ్ సినీ లవర్స్ కన్నప్ప గురించి మాత్రం తెగ ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ ఉన్నాడని, మోహన్ లాల్ ఉన్నాడని, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్‌లు ఉన్నారని కాకుండా.. ఈ సారి మంచు విష్ణు మంచి కంటెంట్‌తోనే వచ్చినట్టు అనిపిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సైతం సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.
కన్నప్ప రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లోను, అలాగే ముంబైలోను స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించారు.ఇది చూసిన ఆడియన్స్.. ఈ మూవీలోని చివరి 30 నిమిషాలు కథ, కథనాలు నా మైండ్ నుంచి తొలగిపోవడం లేదు. కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఇంటెన్స్ ఫీలింగే నాకు కలిగింది. ఆడియెన్స్ ముఖ్యంగా శివ భక్తుల క్లైమాక్స్ చూసిన తర్వాత కంటతడి పెట్టుకోవడం ఖాయం. కన్నప్ప సినిమా వాస్తవ కథ. దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి తన తెగ, ప్రాంతం కోసం పోరాటం చేసిన యోధుడి కథ. ఫస్టాఫ్ సినిమా స్టోగా అనిపిస్తుంది. మోహన్ లాల్ సీక్వెన్స్ టెర్రిఫిక్. ప్రభాస్ అతిథి పాత్ర ఫెంటాస్టిక్. ఇవన్నీ పక్కన పెడితే. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంది అని సుదీర్ఘమైన రివ్యూలో పేర్కొన్నారు.
కన్నప్ప మూవీ గురించి క్రిటిక్ రోహిత్ జైస్వాల్ తన వీడియో రివ్యూలో.. ఈ సినిమా వాస్తవ కథ. గతంలో జన్మించిన మహాపురుషుడు మళ్లీ జన్మలో భగవంతుడిని నమ్మడు. అలాంటి వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే సినిమా కథ. ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. రొమాన్స్ తగ్గించి ఉండాలి. ఈ సినిమా నిడివి కనీసం 15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమా చివరి 40 నిమిషాలు అంటే క్లైమాక్స్ మామూలుగా ఉండదు. నా మాట నమ్మండి. శివ భక్తులు ఊగిపోతారు అని తన కామెంట్ చేశాడు.
Kannappa Movie Review : కథ
అసలు దేవుడే లేడు.. ఆ లింగం ఒట్టి రాయి మాత్రమే అనే తిన్నడు (మంచు విష్ణు) తర్వాత జరిగిన పరిణామాల వల్ల మహా శివభక్తుడిగా ఎలా మారాడు అన్నదే కన్నప్ప కథ. అయితే తిన్నడు మహా భక్తుడిగా మారడానికి.. వాయు లింగం కారణమవుతుంది.దానిని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు.దీనికి కోసం ఏకంగా అక్కడున్న జనాన్ని, గూడాన్ని కూడా తగలబెట్టాలని అనుకుంటారు. దీంతో తన గూడెంలో వాళ్లని కాపాడుకునేందుకు తిన్నడు రంగంలోకి దిగుతాడు. వాయు లింగాన్ని కాదు కదా గూడెంలో ఎవరినైనా తాకాలంటే నన్ను దాటాల్సిందే అంటూ అడ్డుగా నిలబడి పెద్ద యుద్ధమే చేస్తాడు తిన్నడు. ఆ ప్రయాణంలోనే నెమలిరాణి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు తిన్నడు. ఆమె శివుడి భక్తురాలు.
అయితే దేవత మాట ధిక్కరించేవాడికి, పెద్దల మాటకి విలువ ఇవ్వనివాడికి ఈ గూడెంలో చోటు లేదంటూ ఆ తెగ నాయకుడు నాథనాథుడు (శరత్ కుమార్) తిన్నడిని వెలివేస్తాడు. అలా గూడానికి దూరమైన తిన్నడిని మహా శివభక్తుడిగా మారుస్తాడు రుద్ర (ప్రభాస్). అక్కడి నుంచి శివుడుకి (అక్షయ్ కుమార్) మహా శివభక్తుడు అవుతాడు తిన్నడు. ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు వాయు లింగం కోసం ఎందుకు అంత పోరాటం జరిగింది? అసలు ఈ కథలో కిరాటా (మోహన్ లాల్), మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు)ల పాత్రలు ఏంటి అనేది చిత్రం చూస్తే అర్ధమవుతుంది.
Kannappa Movie Review : నటీనటుల పర్‌ఫార్మెన్స్:
కన్నప్పగా టైటిల్ రోల్ లో మంచు విష్ణు అదరగొట్టాడు. ప్రభాస్ రుద్రగా ఉన్న కొంచెం సేపు అయిన మెప్పించాడు. కిరాతక పాత్రలో మోహన్ లాల్ మెప్పించారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పార్వతి పరమేశ్వరులుగా పర్వాలేదనిపించారు. ఇక మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు అదరగొట్టాడు. విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త బాల నటుడి ఈ సినిమాలో చిన్నప్పటి తిన్నడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఓ పాటలో అరియాన, వివియనా సందడి చేశారు. శరత్ కుమార్ సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు బాగానే చేశారు.టెక్నికల్ టీం కూడా వంద శాతం ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తనదైన శైలిలోతెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.. నిర్మాణ విలువలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ పర్వాలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది..
చివరిగా:
తిన్నడి భక్తి అపారం. శివలింగాన్ని పూజించడానికి శుభ్రత, సంప్రదాయాలు ఇవేమీ అతనికి తెలియవు. జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. తిన్నడి నిష్కల్మషమైన భక్తిని తెలియజెప్పడానికి శివుడు ఓ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. తాను నైవేద్యం ఆరగించడు. ఏం జరిగిందా అని చూస్తే..కంటి నుండి రక్తం వస్తుంది. ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి కంటికి కట్టు కడతాడు. అప్పుడు రెండో కంటి నుంచి రక్తం వస్తుంది. దీంతో బాణంతో తన కన్నును బయటకు తీసి మహా శివునికి పెడతాడు. అప్పుడు మళ్ళీ మొదటి కంట్లో నుంచి రక్తం కారుతుంది. అప్పుడు తిన్నడు తన రెండో కన్నును కూడా పెకిలించడానికి సిద్ధపడతాడు.ఇలా శివుడిపై అపారమైన భక్తిని చూపిస్తాడు. ఈ స్టోరీని బాగా చిత్రీకరించారు. విష్ణు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత దాదాపు అరగంట వరకు ఉన్న ప్రభాస్ సినిమాని అలా పైన నిలబెట్టాడు. ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులు భక్తిలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నేటితరం వారు కూడా ఈ మూవీని ఇష్టపడతారు.
రేటింగ్: 2.8/5