Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ కన్నప్పకి మంచు మనోజ్ రివ్యూ..!
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇక మంచు విష్ణుతో వివాదం వేళ మంచు మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు. ‘కన్నప్ప’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ వెళ్లారు.

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ కన్నప్పకి మంచు మనోజ్ రివ్యూ..!
Manchu Manoj : మనోజ్ రివ్యూ ఏంటంటే…
ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూశారు. అనంతరం సినిమాకు రివ్యూ కూడా ఇచ్చారు. తాను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుందని అన్నారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని తెలిపారు. టీమ్ అందరికి కంగ్రాట్స్ కూడా తెలియజేశారు మనోజ్.
మూవీ రిలీజ్‌కి ముందు మనోజ్ తన సోషల్ మీడియాలో అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మా నాన్న, ఆయన టీమ్ ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలపాటు కష్టపడ్డారు. ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను.ప్రభాస్ గోల్డెన్ హార్ట్.. గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్ తోపాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాల అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
